వైయస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం
1 Nov, 2021 10:50 IST
తాడేపల్లి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. త్యాగధనుల ఆశయ సాధన దిశగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలన సాగుతుందన్నారు.