భారీ ఆధిక్యంలో వైయస్ఆర్‌సీపీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తొలి రౌండ్ కౌంటింగ్‌లో మంత్రులు సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, నారాయణలు వెనుకంజలో పడ్డారు. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణపై వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ 1814 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి వెనుకంజలో ఉన్నారు. సోమిరెడ్డిపై వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కాకాణి గోవర్ధర్ రెడ్డి 1750 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక అచ్చెన్నాయుడిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరాడ తిలక్ ముందంజలో ఉన్నారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని, పోలీసులకు వారంతపు సెలవు ప్రకటిస్తామని వైయస్ జగన్ ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా వైయస్ఆర్‌సీపీకి అండగా నిలిచారు. ఈ విషయం పోస్టల్ బ్యాలెట్ ఫలితాలతో స్పష్టమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో అధిక స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులంతా భారీ ఆధిక్యాన్ని సాధించారు. దీంతో ఫ్యాన్ 126 సీట్ల ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తుంది. . ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రౌండ్లలోనూ వెనుకబడ్డారు. కుప్పంలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి చంద్రమౌలి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నారా లోకేష్ మంగళగిరిలో వెనుకబడ్డారు.