ముగిసిన కేబినెట్ స‌మావేశం

24 Jun, 2022 14:41 IST

 అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మొత్తం 42 అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు.