అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
30 Nov, 2020 09:34 IST
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలోనే తొలి అంశంగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. అనంతరం సభలో ప్రభుత్వానికి చెందిన పలు అధికార పత్రాలను సమర్పించారు.