అరటి రైతు నాగలింగం అంత్యక్రియల్లో  అనంత, శైలజానాథ్

5 Dec, 2025 13:14 IST

అనంత‌పురం : అరటి ధరలు అమాంతం పడిపోవడంతో పంట సాగుకు చేసిన అప్పు తీర్చే మార్గం లేక పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగం ఆత్మహత్య చేసుకున్నారు. ఆయ‌న మృత దేహానికి అనంతపురం సర్వజాస్పత్రిలో హడావుడిగా పోస్టుమార్టం పూర్తి చేసి పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో పోలీసుల బందోబస్తు మధ్య  రైతు నాగలింగం అంత్యక్రియలు నిర్వ‌హించారు. ఆయ‌న అంత్యక్రియల్లో  వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శింగనమల నియోజకవర్గం సమన్వయకర్త సాకే శైలజనాథ్, ఇతర  నేతలు పాల్గొన్నారు. రైతు నాగలింగం కుటుంబాన్ని అనంత వెంకట రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఓదార్చి ధైర్యం చెప్పారు.