కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం
అనంతపురం: రాష్ట్రంలో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కోటి సంతకాల కార్యక్రమంతో కూటమి ప్రభుత్వ కళ్ళు తెరిపిద్దామని నగర మేయర్ మహమ్మద్ వసీం పిలుపునిచ్చారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నగరంలోని 43వ డివిజన్ పరిధిలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి పీపీపీ విధానం వల్ల కలిగే నష్టాన్ని వివరించి వాటికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఆధునిక వైద్యాన్ని పేదలకు అందించాలని సంకల్పంతో చేపట్టారన్నారు.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీ లను పిపిపి విధానం తీసుకువచ్చారన్నారు.పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రవేట్ పరం చేయడం వల్ల సీఎం చంద్రబాబు నాయుడు తన వారికి మేలు చేకూర్చి ప్రజలకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. పీపీపీ విధానం రద్దు చేసే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందన్నారు .కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, కార్పొరేటర్ ఇషాక్, వైయస్ఆర్‌సీపీ మున్సిపల్ విభాగం సిటీ వైస్ ప్రెసిడెంట్ కిషోర్ బాబు,యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ధనుబాబు, మైనార్టీ నాయకులు మసూద్, షేక్షావలి, 43వ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ వడ్డే గణేష్, నాయకులు వడ్డే నంది, వడ్డే యశ్వంత్ ,తలారి నరేంద్ర జహీర్ ,యూసుఫ్, దాసరి కార్తీక్, ముద్దు కృష్ణ, దాల్లప్ప, పార్ధు ,దుర్గా, ప్రణీత్ ,నాని, ప్రేమ్ కార్తిక్, తయుబ్, ముని, జగ్గులు, చిరు, అక్మల్ తదితరులు పాల్గొన్నారు.