మైనారిటీ భూములపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం
19 Feb, 2026 12:08 IST
అనంతపురం : మైనారిటీ భూములపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అనంతపురం మేయర్, వైయస్ఆర్‌సీపీ మైనారిటీ నాయకుడు మహమ్మద్ వసీం మండిపడ్డారు. అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మైనారిటీ సమస్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మైనారిటీల భూములు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీమ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ విధానాలు మైనారిటీల అభివృద్ధి, భద్రత, భూముల రక్షణకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సమగ్ర దృష్టి లేకుండా కేవలం ఊహాగానాలు, వాగ్దానాలతో మోసం చేస్తుందని మండిపడ్డారు. సమావేశంలో వైయస్ఆర్‌సీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బేగ్, షేక్ ఈషాక్ , తదితరులు పాల్గొన్నారు.