పార్టీ అధినేత వైయస్ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అంబటి రాంబాబు, బుధవారం బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వం తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ వంటి అంశాలను వైయస్ జగన్‌కు వివరించారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైయస్ జగన్ భరోసానిచ్చారు. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన వైయస్ జగన్. ప్రజల పక్షాన, ప్రజల తరుపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, క్యాడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైయస్ జగన్. వైయస్ జగన్‌ను కలిసిన వారిలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు.