గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు
24 Jun, 2025 21:00 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి అంబటి రాంబాబును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.