ముఖ్యమంత్రి సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన ఆకుల శ్రీనివాస్
24 Feb, 2023 10:42 IST
తాడేపల్లి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ కుమార్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆకుల శ్రీనివాస్ కుమార్ వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి పాల్గొన్నారు.