సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన అహ్మద్ అలీఖాన్
13 Jul, 2023 19:19 IST
తాడేపల్లి: కర్నూలు జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్‌తో సహా పలువురు నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం కర్నూలు జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్, ఇతర నేతలు పోరెడ్డి వేణుగోపాలరెడ్డి, తకియాసాహెబ్, వినయ్ కుమార్‌లు వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి వైయస్ఆర్ సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమం) అంజాద్ బాషా, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి, కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.