వైయస్ జగన్ ఆదేశిస్తే..పవన్ పై పోటీకి రెడీ
17 Jan, 2023 17:17 IST
తిరుపతి: ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వజైర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ పని చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు.
మంత్రి రోజా, అలీ.. మంగళవారం నగరిలోని కొంటగట్టు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ క్రమంలో అలీ మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ ఆదేశిస్తే పవన్‌పై పోటీకి సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు అందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ 175కి 175 సీట్లు గెలవడం ఖాయం. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసు. సినిమా వేరు.. రాజకీయాలు వేరు అంటూ అలీ కామెంట్స్ చేశారు.