రాపర్తి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలోని రాపర్తి చెరువులో అక్రమంగా మట్టి తవ్వి దళారులు సొమ్ము చేసుకుంటున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మట్టి తవ్వకాల వల్ల చెరువు ప్రజలకు ఉపయోగపడకుండా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌ను వైయస్ఆర్‌సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు వంగాగీతా విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. రైతుల పేరుమీద తీసుకున్న మట్టి అనుమతులను అధికారులు వెంటనే పరిశీలించాలని, చెరువులో నుంచి తవ్వుతున్న మట్టిని గ్రామ ప్రజలకు, రైతులకు అలాగే పిఠాపురంలో ఉపాధి పొందుతున్న ఇటుక బట్టీ కార్మికులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే సమీపంలోని నర్సింగపురం లేఅవుట్‌లో ఉన్న సుమారు 65 ఎకరాల భూమిని సదునుపరిచి, పేదలకు ఇచ్చిన పట్టా స్థలాలను గృహనిర్మాణానికి అనుకూలంగా ఉచితంగా అందించాలని కోరారు.