రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు సఫలీకృతం

15 May, 2021 12:00 IST

తాడేపల్లి: కోవిడ్‌ కట్టడి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, ఆక్సిజన్‌ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలతో ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్‌ సరఫరా వేగవంతమైంది.  ప్రస్తుతం 590 మెట్రిక్‌ టన్నులుగా ఉన్న ఆక్సిజన్‌ సరఫరా.. మరో రెండు రోజుల్లో అదనంగా 230 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా కేటాయించిన మూడు ఐఎస్‌ఓ ట్యాంకులతో కలిపి మొత్తం 6 ఐఎస్‌ఓ ట్యాంకుల ద్వారా ఆక్సిజన్‌ ఏపీకి చేరుకోనుంది. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌ నుంచి ప్రత్యేక రైలులో 110 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ గుంటూరు చేరుకోనుంది. అదే విధంగా బెంగాల్‌లోని దుర్గాపూర్‌ నుంచి రెండు కొత్త ట్యాంకర్లతో 60 టన్నుల ఆక్సిజన్‌ ప్రత్యేక రైలులో కృష్ణపట్నం చేరుకోనుంది.