గుంటూరులో  ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

26 Jan, 2026 13:29 IST

గుంటూరు: 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మరియు పశ్చిమ నియోజకవర్గ వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో జెండా వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు నగర వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా పాల్గొని జెండా వందన కార్యక్రమానికి హాజరయ్యారు. నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి, భారత రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్  బాల వజ్రబాబు, గుంటూరు తూర్పు & పశ్చిమ నియోజకవర్గ అబ్జర్వర్  నిమకాయల రాజానారాయణ, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.