ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
4 Dec, 2020 09:23 IST
అమరావతి: ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. పాడి పరిశ్రమ అభివృద్ధి..అమూల్‌తో భాగస్వామ్యంపై చర్చించనున్నారు. కరోనా నివారణ, ఆసుపత్రుల్లో నాడు-నేడుపై శాసన సభలో చర్చ జరుగుతుంది. శాసన మండలిలో ఐదు బిల్లులపై చర్చ జరుగనుంది. పోలవరం, టిడ్కో, స్కూళ్లలో నాడు-నేడుపై చర్చించనున్నారు.