55వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం

విజయనగరం: 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విజయనగరంలోని జిల్లా గ్రంధాలయంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ.. భారతదేశ మొట్టమొదట ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జాతీయ బాలల దినోత్సవ జరుపుకుంటున్న నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ ఆదేశాలు మేరకు బాలల దినోత్సవం రోజే గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. విద్యార్థులకు పాఠశాల విద్యతో పాటు గ్రంథాలయాల్లో పుస్తక విజ్ఞానాన్ని పెంపొందించాలనే ఆలోచనతో ఈ 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించేందుకు కొంత సమయం పుస్తకాలు చదివించే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ రెడ్డి పద్మావతి, జిల్లా విద్యాశాఖ అధికారులు, గ్రంథాలయ కమిటీ మెంబర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.