26న సీఎం వైయస్ జగన్ తుళ్లూరులో పర్యటన
24 May, 2023 11:29 IST
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి (26.05.2023) గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో పర్యటించనున్నారు. జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం వైయస్ జగన్.
ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెంకటపాలెం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం,జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, సభ అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.