కుప్పంలో చంద్రబాబుకు షాక్
చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో షాక్ తగిలింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనకు ఆకర్శితులై టీడీపీకి చెందిన 200 మంది క్రియాశీల కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలకు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు 200 మంది వైయస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ సభ్యత్వం పొందిన గుర్తింపు కార్డులు చేతపట్టుకుని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు.
వీరంతా శాంతిపురం మండలం కడపల్లి, కర్లగట్ట, ప్రీతిశ్యామనూరు, మొరసనపల్లి, 7వ మైలు, గుడుపల్లె మండలానికి చెందిన ఆరు పంచాయతీల్లోని టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు. వారికి మంత్రి పెద్దిరెడ్డి కండువాలు కప్పి వైయస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు.