ఒకటో తరగతి విద్యార్ధిని రూ. 72,500 విరాళం
18 Sep, 2024 17:59 IST
తాడేపల్లి: విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌కు ఒకటో తరగతి విద్యార్థినిఇ ఎం.వర్ణిక తన పాకెట్ మనీ నగదు రూ. 72,500 విరాళంగా అందజేసింది. పులివెందులకు చెందిన ఒకటో తరగతి విద్యార్ధిని ఎం.వర్ణిక తన బాబాయి జి.ప్రణీత్‌కుమార్‌తో కలిసి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నగదు సాయం అందజేసింది. ఈ సందర్భంగా వర్ణికను వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.