ఇది రాష్ట్రమా?..రావణ కాష్టమా?
18 Jul, 2024 13:43 IST
తాడేపల్లి: తెలుగు దేశం పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అధికార టీడీపీ నేతలు రాజ్యమేలుతున్నారు. వినుకొండలో నడిరోడ్డుపై వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త రషీద్‌పై కత్తితో పాశవికంగా దాడి.. చేయి తెగిపడి రక్తమోడుతున్నా రాక్షసానందం పొందుతూ మెడపై నరికి చంపిన టీడీపీ కార్యకర్త జిలాని..ఇలాంటి రౌడీలను ప్రోత్సహించడానికి సిగ్గులేదా టీడీపీ? ఈ దారుణాలు మీకు కనిపించడం లేదా చంద్రబాబు అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ నిన్నటి ఘటనను ట్వీట్ చేసింది. రాష్ట్రం రావణకాష్టంగా మారినా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితా నోరు మెదపకపోవడం పట్ల వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వినుకొండ ఘటనను తీవ్రంగా ఖండించారు.