ఎన్నికల సంఘం తీరు అనుమానస్పదంగా ఉంది
7 May, 2024 19:27 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం తీరు అనుమానస్పదంగా ఉందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ఏది చెబితే అలా పని చేస్తోందని ఆయన తప్పు పట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మనోహర్‌రెడ్డి ఏమన్నారంటే..
- - నాలుగున్నరేళ్లుగా అమలులో ఉన్న పథకాలను అడ్డుకోవడమనేది కుట్ర.
- - వాలంటీర్ వ్యవస్థ విషయంలో కూడా కోర్టు లకు వెళ్లి అడ్డుకున్నారు చంద్రబాబు అండ్ టీం.
- - పెన్సన్ ల పంపిణి రోజులలో వృద్ధుల మరణానికి కారణం చంద్రబాబు.
- - ప్రజలకి అవసరం అయిన పథకాల నిధులు అడ్డుకోవడం మంచి పద్దతి కాదు.
- - చేయూత,ఆసరా,విద్యాదీవెన,రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ వంటివాటిని అడ్డుకోవడం సరికాదు
- - విద్యా దీవెన కోసం విద్యార్థుల ఎదురు చూస్తున్నారు.
- - ఈ బీసీ నేస్తం,ఆసరా డబ్బులను ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.
- - పేదల బ్రతుకులు ఎలా నాశనం చేయాలా అని చంద్రబాబు చూస్తుంటారు.
- - పధకాలు ఆపడంపై లబ్దిదారులు కొందరు కోర్టుకు వెళ్లారు.
- - పథకాలు ఎందుకు అవసరం అనేది ఎన్నికల కమిషన్ కి లిఖిత పూర్వకంగా సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.