ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై అసత్య ప్రచారం..ఈసీకి ఫిర్యాదు
తాడేపల్లి: అమలులోకి రాని ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నాడని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కమీషన్ సిఐడికి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎన్నికల కమీషన్ పైగాని, న్యాయస్దానాలపైనగాని, ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేకుండా చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీకి సపోర్ట్ చేసే నిమ్మగడ్డ రమేష్,పివి రమేష్ లాంటి రిటైర్డ్ అధికారులుకూడా నిస్సిగ్గుగా ట్వీట్ చేస్తున్నారని తప్పుపట్టారు.
పివి రమేష్ ట్వీట్ చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బాదితుడ్ని అని..కృష్ణాజిల్లా విన్నకోట గ్రామంలో మ్యూటేషన్ చేసేందుకు అధికారులు నిరాకరించారని ట్వీట్ లో పేర్కొన్నారని చెప్పారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలులోకి రాలేదు. అసలు సెక్షన్ 4 ఏపి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది భూ రీసర్వే పూర్తి అయ్యాక విడతల వారీగా గజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అమలులోకి వస్తుందన్నారు. సెక్షన్ 4 ప్రకారం గెజిట్ ఇవ్వలేదని హైకోర్ట్ కి కూడా క్లారిటీగా చెప్పడం జరిగిందన్నారు. రమేష్ ఇలా ట్వీట్ చేయడం దుర్మార్గమన్నారు. అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికారుల పరిస్దితి ఇలా ఉంటే ..ఆ ట్వీట్ ను 14 ఏళ్ళు సీఎం గా చేసిన చంద్రబాబు రీట్వీట్ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు. చంద్రబాబు ఎన్ ఆర్ ఐలను, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను గ్రామాలకు పంపి ప్రజలను టైర్రరైజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఈ యాక్ట్ ముసాయిదా డాక్యుమెంట్లను కాల్చినట్లుగా చూశాను. ఇది దారుణం. చంద్రబాబుకు నిజంగా ధైర్యం ఉంటే నేడు ప్రధాని నరేంద్రమోది ఎదుట వాటిని కాల్చి నిరసన తెలియచేసే ధమ్ము, ధైర్యం ఉందా అని మనోహర్‌రెడ్డి సవాలు విసిరారు. మీరు చెబుతున్న నల్లచట్టం గురించి అది అమలు చేయాలని చెబుతున్న నరేంద్రమోదికి చెప్పండి అంటూ సలహా ఇచ్చారు.