వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ల నియామకం
తాడేపల్లి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాంతాల వారీగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో పాటు మరికొన్ని సంస్థాగత నియామకాలు చేసింది. పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఏడుగురిని నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
- ప్రాంతం రీజనల్ కో-ఆర్డినేటరు
- ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లాలు- పీవీ మిధున్‌రెడ్డి
- ఉమ్మడి ప్రకాశం జిల్లా - కారుమూరి నాగేశ్వరరావు
- ఉమ్మడి వైయస్ఆర్ కడప, కర్నూలు జిల్లాలు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- ఉమ్మడి చిత్తూరు, గుంటూరు జిల్లాలు - వైవీ సుబ్బారెడ్డి
- ఉమ్మడి కృష్ణా జిల్లా- ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
- ఉభయ గోదావరి జిల్లాలు - బొత్స సత్యనారాయణ
- ఉత్తరాంద్ర జిల్లాలు - వి.విజయసాయిరెడ్డి
మరికొన్ని సంస్థాగత నియామకాలు
ప్రస్తుత చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లా(తిరుపతి, చంద్రగిరి,శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు) వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రాష్ట్ర బూత్ కమిటీల విభాగం అధ్యక్షుడిగా కొండమడుగుల సుధాకర్‌రెడ్డి నియమితులయ్యారు.