మీ ధైర్యానికి జోహార్లు చంద్రబాబూ
3 Jul, 2019 12:33 IST
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో విత్తనాల సేకరణకు రూ.380 కోట్లు విడుదల చేయాలని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కోరితే ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఆ నిధులను ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మళ్లించారని ఆరోపించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో ప్రజలను బురిడీ కొట్టించడానికి రూ.30,000 కోట్లు మాయం చేశారని దుయ్యబట్టారు. అయినా ఇప్పటికీ నిజాయతీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారనీ, ఆయన ధైర్యానికి జోహార్లు చెబుతున్నానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.