పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు
3 Jun, 2024 21:48 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు జరుగుతున్న కౌంటింగ్ నేపథ్యంలో ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.