వైయస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో విడుదల
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. శనివారం ఉదయం తాడేపల్లిలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు.
సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
ఈ సారి కూడా మనది కేవలం రెండు పేజీల మేనిఫెస్టో.*
ఈ మాటలు నేను చెబుతూ మన మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం రెండు పేజీల మేనిఫెస్టో.
ఇంతకు ముందు ఇదీ మన మేనిఫెస్టో. ఇప్పుడు ఇదీ మన మేనిఫెస్టో(మేనిఫెస్టోలు చూపిస్తూ). ఈ మాదిరిగా.. మన మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించినవి గమనిస్తే, ముఖ్యమైన అంశాలు పైన చెబుతాను. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, డిజిటల్ బోధన.
*వైద్యం..* విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ. ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష.
*వ్యవసాయం..* రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ.
*ఉన్నత విద్య..* జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్ గా కరిక్యులమ్ లో మార్పులు.
*నాడు నేడు..* స్కూల్లు, నాడునేడు ఆస్పత్రులు. పేదలందరికీ ఇళ్లు, అక్కచెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు.
*మహిళా సాధికారత..* చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ.
*సామాజిక భద్రత..* పెన్షన్ కానుక 2 విడతల్లో రూ.3,500కు పెంపు. ఎప్పటిలాగే ఇంటివద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ.
*అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన..* ప్రస్తుతం నిర్మిస్తున్న 4 పోర్టులు పూర్తి చేస్తాం, ఫిషింగ్ హార్బర్ల పూర్తి, ఎయిర్ పోర్టులు, వాటి విస్తరణ పూర్తి, ఇండస్ట్రియల్ కారిడార్లు పూర్తి, నోడ్స్ పూర్తి, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం పూర్తి, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ. ఇదీ దీనికి సంబంధించిన సమ్మరీ.
*ప్రతి స్కీమ్ గురించి మరింత వివరంగా...*
ఇక ప్రతి స్కీమ్‌కు సంబంధించి డెప్త్ లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి. డెప్త్ లోకి పోయే అంశాల్లోకి మనం ఒకసారి పోతే.. మహిళలు.. నా అక్కచెల్లెమ్మలు.. వీళ్లకు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైయస్సార్ చేయూత. ఈ కార్యక్రమం ఇంతకు ముందు రూ.75 వేలు ఉండేది. నాలుగు దఫాలుగా ప్రతి అక్కచెల్లెమ్మకూ వైయస్సార్ చేయూత కింద,మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు 45 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న నా అక్కచెల్లెమ్మలకు చేయి పట్టుకుని నడిపిస్తూ వాళ్లకు ఏదో ఒక ఆదాయం ఉండాలి, నిలదొక్కుకోవాలి, సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి, వాళ్లకు మరింత ఆదాయం సంపాదించుకునే పరిస్థితిలోకి పోవాలి. వాళ్లకు పెన్షన్ గానీ, చేయూత గానీ ఇలా ఏదో ఒక ఆదాయం వాళ్లకు ఉండాలి అనే ఉద్దేశంతో వైయస్సార్ చేయూతను కొనసాగిస్తున్నాం. ఇంతకు ముందు 5 ఏళ్లలో నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఇచ్చాం. దాన్ని కొనసాగిస్తూ మళ్లీ రానున్న ఐదేళ్లలో నాలుగు దఫాల్లో కలిపి మొత్తంగా రూ.1.50 లక్షల దాకా అందిస్తాం. వాళ్లను మళ్లీ చేయి పట్టుకుని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది.
మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందీ ఈ 58 నెలల్లోనే.*
మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథమో, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడు వచ్చింది అంటే.. ఈ ఐదేళ్లలో ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. గతంలో మేనిఫెస్టోని అందరూ చెప్పేవాళ్లు.. ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి, ఒక డాక్యుమెంట్‌ని చూపించేవాళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా ఎక్కడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వాన్నమైన పరిస్థితిని మనమంతా చూసాం.
కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను, ఒక బైబిల్ గా.... ఒక ఖురాన్‌గా, ఒక భగవద్గీతగా భావిస్తూ.. దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలల అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.
*ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మేనిఫెస్టో ఉంది.*
ఇది 2019 నాటి మన మేనిఫెస్టో. 2019 లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్టగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది మనం అమలు చేశాము అంటే ఈ మేనిఫెస్టో అనేది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ముఖ్యమైన అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది.
ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అంటే ఈ మేనిఫెస్టో అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉంది. అన్నిసార్లు ఈ మేనిఫెస్టోని ఇళ్లకు పంపించాం. ప్రతి సంవత్సరం తరువాత ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ... ఇదిగో మా మేనిఫెస్టో.. ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్. చెప్పినవన్నీ మీరే టిక్ చేయండి అని అడిగాము. మొట్టమొదటి సంవత్సరంలో ఏ 85 శాతమో 86 శాతమో లేక 88శాతమో టిక్ చేస్తే, చివరి ఏడాదికి వచ్చేసరికి 99శాతం పైచిలుకు మేనిఫెస్టోను అమలు చేసి మనం ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి.
ఇలా మేనిఫెస్టోను పూర్తి చేసి ప్రతి ఇంట్లో చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అంటే అది ఈ 58 నెలల కాలంలోనే చెప్పడానికి గర్వపడుతున్నాను.
*నవరత్నాల పాలన.*
నవరత్నాల పాలనకు అర్థం చెబుతూ 58 నెలల కాలంలోనే, రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు, డీబీటీగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్లాయి. అవి నేరుగా వారి చేతికే అందడం. ఇదొక హిస్టరీ. రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నాకు చెల్లెమ్మలకు దేవుడి దయతో, మంచి చేయగలిగాము.
పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వ తాతల ఆత్మాభిమానాన్ని ఎరిగినవాడిగా, వాళ్ళ ఇంటికి ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితి కూడా 58 నెలల కాలంలోనే.
2019లో మన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది మనవాళ్లలో కూడా నాతో అన్నారు సాధ్యమేనా అని? ఎందుకంటే 2019లో మనం చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత 58 నెలల్లో మనం ఏవైతే అమలు చేసామో గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఈ మాదిరిగా స్కీములు రావడం గానీ, ఈ మాదిరిగా బటన్ నొక్కడం గానీ, ముందుగానే క్యాలెండర్లో ఈ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము అని ముందే చెప్పి ఆ నెలలో ఆ స్కీము కరెక్ట్ గా అందేలా చేయడం గానీ ఇవన్నీ గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. అవన్నీ కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగాయి.
*2014లో బాబు మోసపూరిత హామీలు.*
2014లో నాకు బాగా గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరితమైన హామీలు ఇస్తూ ఉన్నారు, మనం కూడా ఇవ్వకపోతే ఎలా... మన సంగతి మనం చూసుకుందాం ముందైతే హామీలు ఇచ్చేద్దాం... అని కూడా నా శ్రేయోభిలాషులే సలహాలు ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలేదు. ఆరోజు కూడా నేను చేయగలిగేవి మాత్రమే చెప్పాను. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయాను. ఈరోజు నేను గర్వపడుతున్నాను.
నాకు 2014లో అధికారం రాలేకపోయినప్పటికీ చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగేవి మాత్రమే చెప్పి, చేసి చూపించి, మళ్లీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళుతున్నాను. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ మధ్య తేడా గమనించండి.
రాజకీయాల్లో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే.. ఆ మాట ప్రజలు నమ్ముతారు. నమ్మి ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అని ఆశతో ఓటు వేస్తారు. ఆ ఓటు వేసినప్పుడు, ప్రజల ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సిందేమిటి? వాళ్ల నమ్మకంతో ఆడుకోవడమా? వారి మనోభావాలతో ఆడుకోవడంమా? వారి జీవితాలతో ఆడుకోవడమా?
మనం చేయాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డగా చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ, వారిని చేయి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటారు.
*నా కళ్లారా చూసిన పరిస్థితులు.*
ఈరోజు పేదవాళ్ల పరిస్థితి... ఏమిటి? ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు,,, అద్భుతంగా ఉన్నారు... గతంలో ఎలా బతికారు అన్నది 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూశాను. వాళ్ల దగ్గరకు పోయి నేను చూసినప్పుడు పేదవాళ్ల పరిస్థితి ఏంటి అని గమనిస్తే ... చదివించాలని ఆరాటం ఉన్న పిల్లలను చదివించలేని పరిస్థితి తల్లులది. మొట్టమొదట కడుపు నిండితే తప్పించి, తర్వాతనే చదువులు గుర్తుకు వస్తాయి, అలాంటి పరిస్థితి నుంచి ... ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేసిన పరిస్థితి, తల్లితండ్రులు ఫీజులు కట్టలేక పోవడంతో ఇది చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇవన్నీ నా కళ్లారా చూసాను.
అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి. ఇల్లు ఇవ్వని పరిస్థితి.
రేషన్ కావాలన్నా మరుగుదొడ్లు కావాలన్నా, సబ్సిడీ మీద లోన్లు రావాలన్న, ఇచ్చే ఆరకొర వాటికి కూడా లంచం లంచం లంచం. వివక్ష వివక్ష. ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ ను, రాజకీయ నాయకులు సృష్టించిన సమస్యలను, రాజకీయ పార్టీలు సృష్టించిన సమస్యలను, ఈ వ్యవస్థల వల్ల పేదవాడి బ్రతుకు ఎలా అతలాకుతలం అయిందో నా కళ్ళారా చూశాను.
2019 లో మన పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఈరోజు వరకు, ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ, ఆ సొల్యూషన్ ను మేనిఫెస్టోలో పెట్టి, ఆ సొల్యూషన్‌ను తీసుకొస్తూ ఈ 58 నెలల పాలన సాగింది.
*కోవిడ్ ఉన్నా సంక్షేమంలో సాకులు చూపలేదు.*
కోవిడ్ లాంటి మహమ్మారి వల్ల రెండు సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయినా, రావలసిన ఆదాయాలు రాకపోయినా, అనుకోని ఖర్చులు పెరిగినా, సాకులు చూపలేదు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోలేదు. సాకులు చూపలేదు.
ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎక్కడా సాకులు చూపకుండా.. చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం అండగా ఉన్నాం.
మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ, ఆ ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోని ప్రజల వద్దకు పంపిస్తున్నాం.
వేగంగా అడుగులు వేస్తూ, మనం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆగస్టులో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాం. అక్టోబర్ రెండో తారీకు కల్లా.. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చాం.
గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ, ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా... ప్రతి పథకము బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల చేతికి, వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావడం.
ఎవరైనా మిస్ అయిపోయినా కూడా, వారిని జల్లెడ పట్టి వెతికి, పథకాలు ఏమైనా మిస్ అయితే వారికి మరో అవకాశం కల్పించడం.
*భారతదేశ చరిత్రలో తొలిసారిగా.*
భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగనట్లుగా, మొట్టమొదటిసారిగా ప్రజలకు మంచి చేయడమే కాకుండా, ప్రతి సంవత్సరం మేనిఫెస్టోను పంపించడమే కాకుండా, ఎమ్మెల్యేలను కూడా, ఎప్పుడో ఎన్నికల అప్పుడు గడపగడపకు వెళ్లడం కాకుండా , ఎమ్మెల్యేలను కూడా ప్రజల దగ్గరకు ముందుగానే గడపగడపకు తిప్పుతూ ప్రజలకు జరిగిన మంచిని, ప్రతి ఇంట్లోనూ, ప్రతి వ్యక్తికి రాసిన లెటర్ ని తీసుకువెళ్లి, స్వయంగా వారికే ఇచ్చి, అక్క చెల్లి, ఇచ్చిన హామీలన్నీ జరిగాయి కదా, సంతోషంగా ఉన్నారా అని ఎమ్మెల్యేలు సైతం వారి దగ్గరకు వెళ్లి, వారి ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండలేదు. కానీ మన పాలల్లో ఈ 58 నెలల కాలంలో అది జరిగింది.
*హామీలు అమలు చేయకపోతే పేదల బ్రతులు చిన్నాభిన్నం.*
అధికారంలోకి వచ్చి పార్టీ హామీలు అమలుచేయకపోతే పేదల బ్రతులు చిన్నాభిన్నం అవుతాయి. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే... మేనిఫెస్టో అన్న దానికి అంత పవిత్రత ఎందుకు ఉండాలి అంటే.. ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన వాగ్దానాలు, ఆ మేనిఫెస్టోలో చెప్పిన మాటలతో ఆ తర్వాత అధికారంలోకి ఆ పార్టీ, అధికారంలోకి వచ్చిన వాళ్లు చేయకపోతే, పేదల బతుకులు ఎలా చిన్నాభిన్నం అవుతాయి అనేదానికి ఉదాహరణ మనకన్నా ముందు పరిపాలించిన ప్రభుత్వం.
అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, అప్పట్లో మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు? వాళ్లు మేనిఫెస్టోలో చెప్పినవి ఏవి చేయని కారణంగా ప్రజల బ్రతుకులు ఏ విధంగా చిన్నాభిన్నమయ్యాయి? అనేది ఒకసారి గమనించాలి.
టిడిపి ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్‌ను మీరందరూ చూసే ఉంటారు.
2014లో సాక్షాత్తు ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి.. ముగ్గురి ఫోటోలతో, కింద చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన అంశాలు అంటూ 2014 ఎన్నికల్లో ఒక పాంప్లెట్ ను ప్రతి ఇంటికి పంపించారు. ప్రతీతికి పంపించిన ఈ పాంప్లెట్ ని చూసి, టీవీలలో వీరిచ్చిన అడ్వటైజ్మెంట్లను చూసి, అప్పట్లో ఈనాడులో చూసినా, ఆంధ్రజ్యోతిలో చూసినా, ఏబీఎన్ లో చూసినా, టీవీ 5 లో చూసినా అడ్వర్డైజ్‌మెంట్ ఊదరగొట్టేవారు.
ఒక తల్లి మెడలో మంగళసూత్రం ఒకరు లాగేస్తూ ఉంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. బాబు వస్తున్నాడు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది... అది అడ్వర్డైజ్‌మెంట్.
ముఖ్యమైన హామీలు అంటూ, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి, ఇదే కూటముగా 2014లో ముఖ్యమైన హామీలు అంటూ వీళ్ళు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మి ఓటు వేసినందుకు ప్రజల బతుకులు ఎలా అతలాకుతలం అయ్యాయి అనే విషయాన్ని నాగరిక ప్రపంచంలో ప్రజలు గుర్తించాలి.
ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు. వాళ్ళు చెప్పే ఈ మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు.
ఓట్లు వేసిన తర్వాత అవి అమలు కాకపోతే ప్రజలు బ్రతుకులు ఏమవుతాయని కనీసం ఆలోచన కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలుపెడితే... ఎలా ఉంటాయి?
*టిడిపి 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ముఖ్యమైన అంశాల్లో..*
రైతుల రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తాను అన్నారు. రూ. 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ అయిందా? ప్రతి సిద్ధం సభలోనే ఈ ప్రశ్నను నేను అడుగుతున్నాను.
పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాం అన్నారు. రూ. 14205 కోట్లు .. పొదుపు సంఘాలకు మాఫీ చేస్తానని చెప్పిన సొమ్ము. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా?
*ఇంకా కొన్ని ముఖ్యమైన హామీలు చెప్పారు.*
ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25 వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం అన్నారు. రూ. 25వేల కథ దేవుడు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? ఇంకా ఇలా చాలా ఉన్నాయి.
ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అన్నట్టుగానే ఆరోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ వారు చెప్పిన మాటలు ఇవన్నీ.
ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తాం అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకి రూ. 2000 పెన్షన్ అన్నారు. ఐదు సంవత్సరాలు, అంటే 60 నెలలు, నెలకు రూ. 2000 చొప్పున లక్ష ఇరవై వేల రూపాయలు... ఏ ఇంటికి ఇచ్చారు లక్ష ఇరవై వేల రూపాయలు? పిల్లల జీవితాలతో ఆడుకున్నారు.
అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్లు స్ధలం, పక్కా ఇల్లు అన్నారు. మూడు సెంట్లు కాదు కనీసం ఒక్క సెంటు స్థలం అన్న ఎవరికైనా ఇచ్చారా?
నేను చదివే ప్రతి అంశం చంద్రబాబు సంతకం పెట్టి, ముగ్గురు ఫోటోలు పెట్టి, ఇంటింటికీ పంపించిన ఈ పాంప్లెట్లో నుంచి ముఖ్యమమైన హామీలు అంటూ వీళ్లు రాసినవే నేను చదువుతున్నాను.
పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నారు. చేనేత పవర్ లూమ్ రుణాల మాఫీ అన్నారు. అయ్యాయా?
ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా?
సింగపూర్ కు మించి అభివృద్ధి అన్నారు జరిగిందా?
ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తా అన్నారు. ప్రతి నగరంలో నిర్మిస్తామన్నారు. తాడేపల్లి సంగతి దేవుడెరుగు. విజయవాడలో కనిపించడం లేదు.
*ప్రత్యేక హోదా సంజీవినా అని వెటకారం చేశారు.*
ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అంటూ మీరు చెప్పిన వాటిల్లో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా ? ప్రత్యేక హోదా అయిన తెచ్చారా? దాన్నీ అమ్మేశారు? అదే నోటితో ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? అని చెప్పి మళ్లీ వెటకారం కూడా చేశారు.
నేను చెప్పొదొక్కటే. రాజకీయ నాయకుడు విశ్వసనీయత కోల్పోతే, రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్ధంలేకపోతే రాజకీయాలు ఎందుకు చేస్తున్నాం? ఎవరికోసం చేస్తున్నాం? దేనికోసం చేస్తున్నాం? చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి ఇంటిలో, ప్రతిపేదవాడి గుండెల్లో మన ఫోటో ఉండాలన్న తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి.
రూ.87,612 కోట్ల రుణాలు మాపీ చేస్తానని చెప్పిన పెద్దమనిషి.. రుణాల మాఫీ మాట దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారు విడిపిస్తానన్న మాట దేవుడెరుగు... అంతవరకు అందుతున్న సున్నావడ్డీ రుణాలను కూడా రైతులకు లేకుండా ఎగ్గొట్టారు.
పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాపీ చేస్తామన్న మాటలు దేవుడెరుగు, అక్టోబరు 2016 వరకు అందుతున్న సున్నావడ్డీని సైతం రద్దు చేశారు.
పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటంటే.. ఓవర్ డ్యూస్, ఏన్పీఏలు 18శాతానికి వెళ్లిపోయింది. ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌గా మారిపోయాయి. అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలన్నీ రోడ్డున పడ్డాయి.
ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగభృతి అన్నారు. ఎవరికి ఇచ్చారు? 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే.
అదే మనం ఈ 58 నెలల కాలంలో మనం ఏకంగా 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి సచివాలయంలో పిల్లలు కనిపిస్తారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, స్టాప్‌లు, పారామెడికల్ స్టాప్ కనిపిస్తారు. ఈ రోజు 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు చేశాం. ఎప్పుడూ జరగని విధంగా సంస్కరణలు కూడా కనిపిస్తున్నాయి.
*లంచాలు, వివక్ష లేని పాలన అంటే నమ్మలేని పరిస్థితి నుంచి..*
మొట్టమొదటిసారిగా వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఈ రోజు గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్ధం చెబుతున్నాయి. ఈ 58 నెలలకు ముందు ఎవరైనా మీతో కానీ, ఇంకొకరుతో కానీ గవర్నమెంటు ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అంటే ఎవరైనా నమ్మేవాళ్లా? వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్లా? ఎవరి చుట్టూ తిరగకుండా నేరుగా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్లా? మొట్టమొదటసారిగా మార్పు చేసి చూపించాం.
*సామాజిక న్యాయానికి అర్ధం చెబుతూ..*
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బిసీలు, నా మైనార్టీలు అని పిలుస్తూ.. సామాజిక న్యాయం ఇవాళ కనిపిస్తోంది. ఇవాళ నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలే 68 శాతం మంత్రి పదవుల్లో ఉన్నారు. 5 మంది డిప్యూటీ సీఎంలలో 4గురు నేను నా అని పిలుచుకునే నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలే ఉన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను ఈ 58 నెలల కాలంలో ఏకంగా చట్టం చేసి మరి అమలు చేశాం.
మొట్టమొదటిసారిగా 175 అసెంబ్లీ, 25 ఎంపీలు కలిపి ఉన్న 200 స్ధానాలకు గానూ.. ఏకంగా 50శాతం అంటే 100 స్ధానాలు నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన చరిత్ర ఈ అంధ్రరాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా?. పోనీ దేశంలో ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా?. సామాజిక న్యాయం అన్నదానికి అర్ధం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపించిన పాలన కూడా ఇక్కడే జరిగింది.
మన పల్లెటూరి పిల్లలు, మన పేద పిల్లలు ఐక్యరాజ్యసమితికి కూడా వెళ్లి రెట్టించిన ఆత్మ విశ్వాసంతో ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడగలిగే పరిస్థితి ఇవాళ మనమంతా చూస్తున్నాం. ఫస్ట్ క్లాస్‌లో ఐబీతో ప్రయాణం మొదలవుతుంది. గవర్నమెంటు బడుల్లో నాడు నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లిషు మీడియం ఇవాళ గవర్నమెంటు బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది. మరో పది సంవత్సరాలలో ఇదే పాలన కొనసాగితే జరగబోయే మార్పులు ఒకసారి గమనించండి. ఒకసారి ఊహించండి.
ఒకటో తరగతి పిల్లవాడు ఐబీ ఫస్ట్ క్లాస్ ఈరోజు జాయిన్ అవుతున్నాడు. 2035లో టెన్త్ క్లాస్‌లో ఐబీ ఎగ్జామ్ రాస్తాడు. ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆక్స్ఫర్డ్, స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, ఏంఐటీ వంటి వాటితో.. వారికి సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి ఆన్లైన్ ద్వారా వాళ్లచేతనే సర్టిఫికేట్లు ఇచ్చే గొప్ప అనుసంధానం మన డిగ్రీలతో జరిగింది.
2035 నాటికి ఐబీలో మన పిల్లలు పదోతరగతి సర్టిఫికేట్ తీసుకుంటారు. ఆ తర్వాత నాలుగైదేళ్లకు డిగ్రీ పాసవుతారు. ఆ డిగ్రీలో వారి చదివే కోర్సుల్లో కరిక్యులమ్ కూడా దాదాపు 30 శాతం కోర్సులు హార్వర్డ్ నుంచో, స్టాన్‌ఫర్డ్ నుంచి సర్టిఫికేట్లు వస్తాయి. ఈ 10–15 సంవత్సరాల తర్వాత ఆ క్వాలిటీ చదువులతో పిల్లవాడు బావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెడితే.. పరిస్థితి ఏమిటి? . ఆ పేదలు అనర్గళంగా ఇంగ్లిషు మాట్లాడుతూ ఉద్యోగాల కోసం అఫ్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి? పేదిరికం అన్నది మటుమాయం అయ్యే పరిస్థితి. విద్యారంగంలో మొదలుపెడితే కనీవినీ ఎరుగని మార్పులు వైద్యరంగంలో, వ్యవసాయరంగంలో, మహిళా సాధికారతవిషయంలో, అవ్వాతాతల సంక్షేమంలో, సామాజిక న్యాయంలో ఇవాళ కనిపిస్తున్నాయి.
*గ్రామాల్లో సమూల మార్పులు.*
గ్రామంలోకి అడుగుపెట్టి.. నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. సచివాలయం కనిపిస్తోంది. ఆరువందల రకాల సేవలు, ప్రతి ఆరవై, డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్, వివక్ష, కరెప్షన్ లేకుండా ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్న సేవలు. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే విలేజ్ క్లినిక్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్. ప్రతి ఇంటికీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష. విస్తరించిన ఆరోగ్యశ్రీ సేవలు. ఆరోగ్య ఆసరా. మరో నాలుగు అడుగులు వేస్తే.. అక్కడ రైతన్నను చేయిపట్టుకుని నడిపించే రైతుభరోసా కేంద్రం కనిపిస్తుంది. అక్కడే నాణ్యమైన విత్తనాలు, ఫెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ సరఫరా దగ్గర నుంచి మొదలుపెడితే పంటల కొనుగోలులో కూడా దళారులు లేని వ్యవస్ధ అక్కడే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే.. నాడు నేడుతో మార్పు చెందిన ఇంగ్లిషుమీడియం బడులు కనిపిస్తాయి.
ఇవన్నీ మరో 10–15 సంవత్సరాలు జరిగితే ఎలాంటి మార్పు వస్తుందో ఆలోచన చేయండి. ఇంతకముందు ఇదే మేనిఫెస్టో నేను చూపించాను. 2019లో మనం చూపించిన మేనిఫెస్టో ఏ రకంగా అమలు చేశామో చూపించాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ స్కీములు ఎప్పుడూ వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం.
*చంద్రబాబు దొంగ హామీలు.*
అదే విధంగా 2014లో చంద్రబాబు నాయడుగారు ఏ రకంగా చేశారు. ఆయన ఇచ్చిన దొంగ హామీలనూ చూపించాం. చేయని వాటిని కూడా చూపించాం. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని అంటున్నాడు.
చంద్రబాబు చెప్పే ఈ సూపర్ సిక్స్‌లకు ఈ సూపర్ టెన్‌లకు అసలు ఎంత ఖర్చవుతుంది. ఇది సాధ్యమైనా.. మళ్లీ చంద్రబాబునాయుడు గారు 2014 మాదిరిగానే మరలా హిస్టరీ రిపీట్స్. మళ్లీ ఇదే సంతకం. ఇదే కూటమి. మళ్లీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ అంటూ ప్రజలజీవితాలతో చెలగాటం ఆడ్డమే. దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది గమనించాలి.
2019లో మనం ఎప్పూడూ చూడని విధంగా, జరగని విధంగా మనం అమలు చేసిన ఈ స్కీంలు, సంస్కరణలు, మేనిఫెస్టోలో సంవత్సరానికి రెండూ కలిపితే డీబీటీ, నాన్ డీబీడీ(ఇంటే ఇళ్ల స్ధలాలు, పిల్లలకిచ్చే ట్యాబులు, విద్యాకానుక, గోరుముద్ద లాంటివన్నీ) రెండూ కలిపితే సంవత్సరానికి దాదాపు రూ.70వేల కోట్లు ఖర్చయింది.
ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎప్పుడూ జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే.. గతంలో ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా పరిపాలన జరిగితే ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే రూ.70వేల కోట్లు దాదాపుగా మనం ఇవ్వగలిగాం.
ఈ రోజు చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్, సూపర్ టెన్లు గమనిస్తే... రూ.1,21,619 కోట్లు అవుతుంది. వీటికి తోడు జగన్ చేస్తున్న కొన్ని పథకాలు ఆపడం ఎవరి చేతా కాదు.
అటువంటివి కొన్ని పథకాలు ఉన్నాయి. అవి చూస్తే.. ఫీజు రీయింబర్స్మెంట్ కింద వసతి దీవెన, విద్యాదీవెన ఆపడం ఎవరి చేతా కాదు. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణం(ఆరేళ్ల లోపు పిల్లలకు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు) రేషన్ ఇస్తున్నాం. ఇది ఆపడం ఎవరి చేతా కాదు. ఉచిత బియ్యం ఇస్తున్నాం. కేంద్రం కొంత ఇస్తే.. మిగిలినంతా రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీ పెంచి ఇస్తుంది.
18.50 లక్షల మంది రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. జగన్ చిన్నపిల్లకు గోరుముద్ద ఇస్తున్నాడు.. ఎవరికైనా ఇది చేయకతప్పదు. ఇటువంటి ఈ పథకాలకు మరో రూ.29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయకతప్పని ఖర్చు.
రెండూ కలిపితే రూ.1,50,718 కోట్లు. జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా పాలన చూపిస్తే... రూ.70వేల కోట్లు చాలా కష్టపడి చేయగలుగుతున్నాం.
*చంద్రబాబు - అలవాటైన మోసం.*
మరి రూ.1.50 లక్షల కోట్లతో ఆయన సూపర్ సిక్స్, సూపర్ టెన్ అని అంటూ ప్రజలను అడ్డగోలుగా ప్రజలను మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి.. ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్‌గా.. హేబిట్యువల్ అఫెండర్‌లా.. 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికీ పంపించి ఇదే కూటమిలో ఉంటూ మోసం చేసిన ఈ వ్యక్తి, మరలా హిస్టరీ రిఫీట్స్ అన్నట్టు మరలా 2024లో సాధ్యం కాని హామీలతో అబద్దానికి రెక్కలు కడుతున్నారు. రూ.1.50 లక్షల కోట్లకు సంబంధించి సాధ్యం కాని హామీలతో ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం, దొంగతనం కన్నా అన్యాయం కాదా? 420 కాదా? ఛీటింగ్ కాదా? ఆలోచన చేయండి. మీ మనసులకే విడిచిపెడుతున్నాను.
రాజకీయ నాయకుడుంటే ఎలా ఉండాలి. మాట చెబితే ఆ మాట మీద తాను నిలబడాడు అన్న నమ్మకం ఉండాలి. ఏకార్యకర్త అయినా ఫలానా రాజకీయ నాయకుడిని చూసినప్పుడు అదిగో ఫలానా నాయకుడు మా నాయకుడు, అదిగో అతడే మా లీడర్ అని కాలర్ ఎగరేసుకుని చెప్పాలి.
కానీ ఈ మాదిరిగా చేస్తే కాలర్ ఎగరేసుకుని చెప్పడం మాట దేవుడెరుగు.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలెక్కడైనా కనిపిస్తే.. దొడ్డిదారిని పోయే కార్యక్రమం జరుగుతుంది.
అదేమాదిరిగా ఈయన మనం చెబుతున్న రూ.70 వేల కోట్లకు అదనంగా మరో రూ.80 వేల కోట్లు చెబుతున్నాడు. సాధ్యం కాదని తెలిసినా తాను చెబుతున్నాడు.
ప్రతి సందర్బంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే... జగన్ చేయలేకపోయాడు. నేను సంపద సృష్టిస్తాను అంటాడు. నేను సంపద సృష్టిస్తాను కాబట్టి నేను చేయగలుగుతాను అని నిస్సిగ్గుగా తన అబద్దాన్ని డిఫెండ్ చేసుకుంటాడు. తాను చెప్పే మోసాలను, అబద్దాలను నిస్సిగ్గుగా డిఫెండ్ చేసుకుంటాడు.
ఈ 14 యేళ్ల తన పరిపాలనలో తాను ఏ స్ధాయిలో సంపద సృష్టించాడో చూస్తే.. ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ఫ్లెస్ ఉందా? ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ లోటే. మరి రెవెన్యూ ఎక్స్పెండేచర్కే రెవెన్యూ లోటు అవుతున్నప్పుడు... సంపద ఎక్కడ నుంచి సృష్టించారు. గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతున్నాను బాబు. ఇది వాస్తవం. అదే చంద్రబాబు లేని పరిపాలన, చంద్రబాబు ముందు పరిపాలన గమనిస్తే... అంతా రెవెన్యూ సర్ఫ్లెసే కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిటీ అన్నది ఒక్క బాబు హయాంలోనే కనిపిస్తుంది.
చంద్రబాబు సంపద సృష్టించలేదని తెక్కలు చెబుతున్నాయి. ఇదే బాబును నేను అడుగుతున్నాను... సంపద సృష్టించింది ఎక్కడా అని? కారణం సంపద సృష్టించే శక్తి లేదు. సమగ్రమైన ఆర్ధిక నియంత్రణ కూడా లేదు. తన 14 ఏళ్ల పాలన కూడా దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు.
జగన్ ఎందుకు చేయగలిగాడు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? ఇక్కడ కరెప్షన్ లేదు, వివక్ష లేదు కాబట్టి.
పోనీ అప్పులు పరిస్థితి కూడా ఒకసారిæ గమనిద్దాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబునాయుడు హయాంలో అప్పులు ఎంత చేశాడు? జగన్ ఎంత అప్పులు చేశాడు.
*అప్పులు పరిస్థితిని ఒక్కసారి గమనించినట్లైతే...* 2014 నుంచి 2019 వరకు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే... చంద్రబాబు పాలన 2019 మే వరకు జరిగింది. ఆయన అధికారంలోకి రాకముందు రూ.1.18 లక్షల కోట్లు అప్పులుంటే... 2019 నాటికి రూ.2.71 లక్షల కోట్లకు ఎగబాకింది.
దీనికి తోడు గవర్నమెంట్ గ్యారంటీడ్ రుణం లెక్కిస్తే... బాబు రాకముందు రూ.14వేలు కోట్లు, బాబు హయాంలో రూ.59 కోట్లు, మన హయాంలో రూ.1.43 లక్షల కోట్లు పెరిగింది. అలా చూసినా రూ.6.34 లక్షల కోట్లు. అది కాక ఇంకా ముందుకు వెళ్దాం. నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెఫ్త్ స్టేట్ పీఎస్‌యూలు కూడా తీసుకుందాం.
మొత్తం పవర్ సెక్టార్ కార్పొరేషన్లో రుణాలు రూ.29వేల కోట్లు ఉంటే... ఆయన రూ.69 వేల కోట్లకు తీసుకుపోతే.. మనం వచ్చిన తర్వాత రూ.1.06 కోట్లు ఉంది.
పే బిల్స్ ఆన్ ఎకౌంట్ ఆఫ్ పవర్ పర్చేజస్ చూస్తే.. ఆయన హయాంలో రూ.21వేల కోట్లకు ఎగబాకితే మన హయాంలో రూ.8,500 కోట్లకు తగ్గింది.
నాన్ గ్యారంటీడ్ పవర్ లయబులిటీస్ అండ్ పేబుల్ కేటగిరీ –3 కలుపుకుంటే..ఆయన హయాంలో రూ.81 వేల కోట్లకు ఎగబాకితే..మన హయాంలో తగ్గి.. రూ.69వేల కోట్లకు తగ్గింది.
*ఎవరిది ఫైనాన్షియల్ డిసిప్లిన్*
మొత్తం టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ గ్యారెంటీ పీఎస్‌యూ లయబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లయబిలిటీస్ ఉన్నాయని చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో రూ.1.53 లక్షల కోట్లు కాస్తా రూ.4,12,288 కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది రూ.7.03 లక్షల కోట్లకు ఎగబాకింది. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ డెబిట్ చూస్తే ఆయన హయాంలో 21.87 శాతానికి ఎగబాకితే మన హయాంలో మన 5 ఏళ్లలో కేవలం 12.13 శాతం మాత్రమే. మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది?
క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు? నేను స్కీములకు పెట్టలేదు.. నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు పెట్టాను.. అందుకనే నేను చేయలేకపోయాను.. అని ఇంకో మాట మాట్లాడతాడు. పోనీ అక్కడా చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది అన్నది.
ఎవరి హయాంలో నాడు–నేడు జరిగింది? ఎవరి హయాంలో ఆస్పత్రులు బాగుపడ్డాయి? ఎవరి హయాంలో స్కూల్లు బాగుపడ్డాయి? ఎవరి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది? ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద సంవత్సరానికి రూ.15,227 కోట్లు అయితే, మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.17,757 కోట్లు. కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడుతున్నాం. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇన్ ఫ్యాక్ట్ మనకు కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ.. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తు పెట్టుకోవాల్సింది అందరూ కూడా. రెండు సంవత్సరాలు కోవిడ్ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్ పర్ఫార్మెన్స్ ఇదీ.. చంద్రబాబు పర్ఫార్మెన్స్ అది.
పోనీ ఇంకొక సైడ్ కూడా ముందుకు పోదామా? మన షేర్ ఆఫ్ జీఎస్డీపీ ఇన్ జీడీపీ ఆఫ్ ద కంట్రీ. ఇది జీడీపీలో మన రాష్ట్ర షేర్ ఎంత? అంటే పురోగతి అనేది ఏమిటి? దేశ ఖజానాకు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం? అది చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 4.47 శాతం కాంట్రిబ్యూషన్ ఉంటే మన హయాంలో 4.83 శాతం కాంట్రిబ్యూషన్. అంటే గ్రోత్ పెరిగి ఇంత డిఫికల్ట్ పీరియడ్ లో, కోవిడ్ ఉన్న సమయంలో కూడా రాష్ట్ర గ్రోత్ పెరిగి దేశానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్న దాంట్లో 4.83 శాతం. వర్సెస్ 4.47 శాతం చంద్రబాబు పాలనలో. అంటే ఎవరి హయాంలో గ్రోత్ ఉంది? ఎవరి హయాంలో అభివృద్ధి ఉంది? ఎవరి హయాంలో క్యాపిటల్ క్రియేషన్ జరిగింది? ఎవరి హయాంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు వేస్తూ పరుగెత్తుతున్నాయి?
ఇంకొకటి చూద్దామా? ఇంకొకడు అంటాడు జగన్ ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నాడు.. జగనేమో ఒకపక్క ఇస్తాడు, మరో పక్క ట్యాక్సులతో బాదేస్తాడు అని చెప్పి ఇంకో మాట కూడా మన మీద మాట్లాడతారు. అదీ చూద్దామా పోనీ. ట్యాక్స్ బర్డెన్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీఎస్డీపీ. చంద్రబాబు నాయుడు హయాంలో ట్యాక్స్ బర్డెన్ ఆఫ్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీఎస్డీపీ చూస్తే 6.57 శాతం అయితే, జగన్ హయాంలో అది 6.35 శాతమే. మరి ఎవరి హయాంలో ఎవరు ట్యాక్సులతో బాదారయ్యా? ఇవన్నీ కూడా కనిపించే సోర్సులు. ఆర్బీఐలు, కాగ్‌లు, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్లు అన్ని చోట్లా ఇవన్నీ కనిపించే డాక్యుమెంట్లు.
*ఇవన్నీ కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే..* అబద్ధానికి వీళ్లంతా కూడా రెక్కలు కట్టి వీళ్లంతా ఏమాదిరిగా దీన్ని మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు? ఇది ధర్మమేనా? అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి చెబుతున్నా. ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెబుతున్నాను. చేయలేకపోతే చేయలేను అని చెబుతాడు తప్ప జగన్ ఎప్పుడూ అబద్ధాలు ఆడడు. జగన్ ఎప్పుడూ మోసం చేయడు. పేదలను ప్రేమించే, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా, పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ వేయలేదు. మేనిఫెస్టోలో పెట్టనవి కూడా చాలా చేశాం. చాలా జరిగాయి ఈ 58 నెలల కాలంలో.
ఇప్పుడు కాపు నేస్తం ఉంది మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి. మేనిఫెస్టోలో లేదు. ఈబీసీ నేస్తం ఉంది. మేనిఫెస్టోలో లేదు. ఇటువంటివి అనేకం. ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు పెంచడం, పిల్లలకు విద్యా కానుక, గోరుముద్ద మేనిఫెస్టోలో లేవు. ఇటువంటివి అనేకం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మేనిఫెస్టోలో లేవు. అనేకం చేశాం. ప్రతి ఒక్కరికీ కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసేది ఒక్కటే. ఈరోజు ఉన్న పరిస్థితుల దష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో, ఆ మేరకు నేను చెప్పగలుగుతా. అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదల్చుకోలేదు. ఎందుకంటే అది అబద్ధాలు అని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడటం ధర్మం కాదు కాబట్టి. చేయగలిగినవి మాత్రమే జగన్ చెబుతాడు. అవకాశం, వెసులుబాటు ఏ మాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్లీ మళ్లీ చెబుతున్నాను.
అవకాశం, వెసులుబాటు ఏ మాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు కచ్చితంగా వేస్తాడు అని మాత్రం కచ్చితంగా వేస్తాడు. పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్ కు ఉన్న ప్రేమ, చంద్రబాబుకు కాదు కదా.. ఇంక ఎవరికీ కూడా ఆ ప్రేమలుండవు. చంద్రబాబునాయుడుకు అయితే ప్రేమ ఉండదు అది వేరే విషయం. ఎవరికీ కూడా అటువంటి ప్రేమలుండవు.
*వైయస్సార్ కాపు నేస్తం.*
ఇంతకు ముందు 4 దఫాల్లో రూ.60 వేలు ఇచ్చాం. మళ్లీ రానున్న ఐదేళ్లలో నాలుగు దఫాల్లోమరో రూ.60 వేలతో మొత్తంగా రూ.1.20 లక్షల వరకు అందిస్తాం.
*వైయస్సార్ ఈబీసీ నేస్తం..*
ఈ 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45 వేలు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ ఈ 5 ఏళ్లలో 4 దఫాల్లో మరో రూ.60 వేలు ఇస్తూ మొత్తంగా రూ.1.05 లక్షల వరకు అందిస్తాం.
జగనన్న అమ్మ ఒడి. ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్టు. అన్నీ నా పెట్ ప్రాజెక్టులే కానీ, ప్రజల కష్టాల నుంచి చూసి వారి బతుకులను బాగు పరచాలనే తపన, తాపత్రయం నుంచి బయటకొచ్చిన ప్రతి స్కీము. జగనన్న అమ్మ ఒడి అనేది పిల్లలకు సంబంధించినది కాబట్టి నా మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకు ముందు రూ.15 వేలు ఉండేది. రూ.13 వేలు నేరుగా అక్కచెల్లెమ్మల చేతికి ఇచ్చే పరిస్థితి. మరో రూ.2 వేలు వాళ్ల స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ల గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మ ఒడి రూ.15 వేలు కాస్తా రూ.17 వేలకు పెంచుతున్నాం. తల్లి చేతికే నేరుగా రూ.15 వేలు వస్తుంది. ఆ తర్వాత పిల్లలు వెళ్లే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్ లో ఉన్న టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం మరో రూ.2 వేలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ దాని కోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మ ఒడి రూ.17 వేలు చేస్తూ తల్లి చేతికి రూ.15 వేలు ఇవ్వడం జరుగుతుంది.
వైయస్సార్ సున్నా వడ్డీ, వైయస్సార్ ఆసరా కింద రూ.25,571 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18 శాతం ఓవర్ డ్యూస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా మారి ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సీ గ్రేడ్, డీ గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన అక్కచెల్లెమ్మలను చేయిపట్టుకుని నడిపిస్తూ ఈ నాలుగు దఫాలుగా ఇచ్చే రూ.25,571 కోట్లు విజయవంతంగా పూర్తి చేసిన పరిస్థితులు. ఆ అక్కచెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ రూ.3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కొనసాగుతుంది.
*వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా..*
ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్లీ కొనసాగుతుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగానే చదువులను ప్రోత్సహిస్తూ పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఏదైనా కూడా ప్రతి పథకంలో కూడా ఒక రీజన్, లాజిక్ ఉండాలి. అమ్మ ఒడి ఉంది. 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి. ఇప్పుడు కూడా జరుగుతోంది. యధావిధిగా ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. అదే విధంగా కల్యాణమస్తు, షాదీ తోఫా. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ప్రతీదీ ఒక పర్పస్ ఉండాలి. చదువును ప్రోత్సహించేందుకు, చేయిపట్టుకుని నడిపించేందుకు, వాళ్లను వాళ్ల జీవితాల్లో ఎదిగేందుకు ఉపయోగపడేలా ప్రతి పథకమూ ఉండాలి.
*పేదలందరికీ ఇళ్ల పట్టాలు..*
ఇప్పటికే 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇప్పటికే అందులో 9.2 లక్షల ఇళ్లు పూర్తి కూడా అయిపోయాయి. మిగతావి వేగంగా పనులు జరుగుతున్నాయి.ఇది వచ్చే 5 ఏళ్లు కూడా కొనసాగుతుంది. అర్హులై ఉండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలిచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ బ్యాలన్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఇళ్లు కట్టడానికి ఆ 10 లక్షలు ఇంకా కొంచం ఎక్కువ వేసుకున్నా కూడా వాళ్లు ఇంకా అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా ఈ 10 లక్షలు వాళ్లకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది.
*లబ్ధిదారుల సంఖ్య చూస్తే...*
అసలు ఈ లబ్ధిదారుల సంఖ్య ఒకసారి చూడాలి. చేయూత కార్యక్రమంలో 33 లక్షల మంది అక్కచెల్లెమ్మలు.. 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది రూ.19,189 కోట్లు. కాపు నేస్తం ద్వారా ఏకంగా 4.63 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,030 కోట్లు. వైయస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.1,877 కోట్లు.
జగనన్న అమ్మ ఒడి ద్వారా దాదాపుగా 53 లక్షల మంది తల్లులకు ఇచ్చినది రూ.26,000 కోట్లు. వైయస్సార్ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది రూ.4,969 కోట్లు. వైయస్సార్ ఆసరా ద్వారా మరో 79 లక్షల మందికి ఇచ్చింది రూ.25,571 కోట్లు. వైయస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా 56,000 మందికి ఇచ్చినది మరో రూ.427 కోట్లు. పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలం కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు, అందులో 22 లక్షల మందికి ఇళ్లు నిర్మించే కార్యక్రమం జరుగుతోంది. ఇవి ఇంతకు ముందు నేను చెప్పిన వాటికి ఈ నంబర్స్ మిస్ అయ్యాయి. ఈ నంబర్స్ యాడ్ చేశాను.
*పట్టణ గృహనిర్మాణం.*
ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్లలో చేయబోతాం. పట్టణాల్లో ప్రత్యేకించి మిడిల్ ఇన్కమ్ గ్రూప్‌నకు సంబంధించి. దీనికోసం ప్రతి ఏటా రూ.1,000 కోట్లు కేటాయిస్తూ 2 సంవత్సరాల్లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ ఎంఐజీ లే అవుట్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూపు ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లలో మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే గవర్నమెంట్‌కు లాభం వేసుకోకుండా తక్కువ రేటుకే వాళ్లందరికీ కూడా ఈ ప్లాట్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది.
దీని వల్ల టౌన్స్, సిటీస్ లో ఇటువంటి చోట మిడిల్ ఇన్ కమ్ గ్రూపులో ఉన్న వాళ్లందరికీ కూడా అధికారిక పట్టా, అధికారిక డాక్యుమెంట్స్ తో తక్కువ రేటుకు వీళ్లందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్స్ లో పట్టాలు అందుబాటులో ఉంటాయి.
*పెన్షన్ల పెంపు.*
అసలు ఈ పెన్షన్ల విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని అంశాలున్నాయి. పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు అంటే మార్చి 1 దాకా. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే రూ.1,000. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే 39 లక్షల మంది. ఈరోజు పెన్షన్ 66 లక్షల మందికి పెన్షన్. పెన్షన్ సొమ్ము రూ.3 వేలు. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది రూ.24 వేల కోట్లు.
*చాలా ముఖ్యమైన విషయం.*
చాలా ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? దేశంలోనే ఇంత రూ.3 వేలు ఇస్తున్న రాష్ట్రంగానీ, జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం గానీ దేశంలో ఏదీ లేదు. ఇలా సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తుంటే హయ్యస్ట్ ఇన్ ద కంట్రీ. తెలంగాణలో ఎంతో తెలుసా? కేవలం 43 లక్షల మంది పెన్షన్ అమౌంట్ రూ.2 వేలు, ఖర్చు చేసేది సంవత్సరానికి రూ.12,230 కోట్లు. ఉత్తర ప్రదేశ్ లో పెన్షన్ అమౌంట్ రూ.1,000, ఇచ్చేది 80 లక్షల మందికి, ఖర్చు చేసేది రూ.9,592 కోట్లు. రాజస్థాన్ లో పెన్షన్ అమౌంట్ రూ.750, ఇచ్చేది 90 లక్షల మందికి, జనాభా 8.31 కోట్లు, మన జనాభా 5.10 కోట్లు. రూ.8,114 కోట్లు వాళ్లు సంవత్సరానికి ఖర్చు.
కేరళలో వాళ్లు రూ.1,600 ఇస్తున్నారు నెలకు. 48 లక్షల మందికి ఇస్తున్నారు. రూ.7,295 కోట్లు. దేశం కన్నా మనం ఎంత పైనున్నామో ఒక్కసారి గమనించాలి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే.. జగన్ కు మనసు, మానవత్వం ఉన్నాయి. అవ్వాతాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవరూ చూపించలేదు, చూపించబోరు. ఎందుకు చెబుతున్నానంటే.. పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా రూ.3,500కు పెంచుతాం. రూ.250 పెరిగేది జనవరి 2028. ఇంకో రూ.250 పెరిగేది జనవరి 2029. డేట్లతో సహా ఎందుకు చెబుతున్నానంటే కల్మషం లేదు నాలో. అబద్ధం చెప్పదల్చుకోలేదు. మోసం చేయదల్చుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్టు చేయాలి. సపోర్టు చేయగలిగినప్పుడే పెన్షన్లు మనం ఇవ్వగలుగుతాం. ఇంతింత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం. లేకపోతే చేయనుకూడా చేయలేం. రూ.250 పెరిగిందంటే దాదాపుగా దాని కాస్ట్ రూ.2000 కోట్లు పైచిలుకు పడుతుంది. మరో రూ.250 పెరిగిందంటే దాని కాస్ట్ రూ.4,000 కోట్లు ప్రతి సంవత్సరం.
సపోర్ట్ చేసేపరిస్థితులు ఉండాలి. కుదుట పడి, ఇప్పుడు చేస్తున్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుట పడి, మళ్లీ కొద్దోగొప్పో వెసులుబాటును మళ్లీ వచ్చి కొద్దో గొప్పో వెసులుబాటును నేను మళ్లీ అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో, మళ్లీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడంటే అదీ లాస్ట్ 2 సంవత్సరాల్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఈ నంబర్లు కూడా అప్పుడు ఇస్తాను అని కచ్చితంగా చెబుతున్నాను.
*వ్యవసాయ రంగం..*
రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు రూ.50 వేలు ఇస్తాం 5 సంవత్సరాల్లో అని చెప్పి రైతన్నలకు రూ.67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. రూ.13,500 రైతు భరోసాగా ఇస్తూ. ఈసారి ఈ 13,500ను రూ.16,000కు పెంచి ఈ 5 సంవత్సరాల్లో రైతన్నకు మరో రూ.80 వేలు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా అనే పథకం ద్వారా. దీని వల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీని వల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు ఇస్తున్న మాదిరిగానే మూడు దఫాల్లో జరుగుతుంది. పంట వేసే సమయంలో, పంట కటింగ్ సమయంలో, మళ్లీ సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది.
పంట వేసే సమయంలో రూ.8 వేలు ఇస్తాం. కటింగ్ సమయంలో మరో రూ.4 వేలు, సంక్రాంతికి మరో రూ.4 వేలు ఇస్తాం.
రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు ఇప్పుడు ఇస్తున్నట్టుగానే కొనసాగుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఇస్తున్నాం. అది కొనసాగుతుంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వ్యవసాయం ఒక్కటే పెద్ద సబ్జెక్టుగా ఉంది. మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా కొనసాగుతాయి. ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నేను చెబుతున్నా. మేనిఫెస్టో నెట్ లో అందుబాటులో పెడతాం. ఎవరైనా కూడా నెట్ లో పూర్తిగా సమగ్రంగా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం మేనిఫెస్టోను మాయం చేయం. మన మేనిఫెస్టో ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో, నెట్ లో ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆరాటపడతాను.
స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తున్నట్టుగా కొనసాగుతుంది. ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా మత్స్యకారులకు రూ.50 వేలు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో కూడా మరో రూ.50 వేలు ఇస్తూ మొత్తంగా దాన్ని రూ.1 లక్ష దాకా తీసుకుని పోతాం.
వాహన మిత్ర కింద సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకుంటున్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో రూ.50 వేలు ఇచ్చాం. వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో రూ.50 వేలు ఇస్తాం. మొత్తంగా చూస్తే.రూ.1లక్ష వాళ్ల చేతిలో పెట్టినట్లవుతుంది.
*మత్స్యకార భరోసా*
మత్స్యకార భరోసా వల్ల దాదాపుగా 2.43 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలకు మంచి జరిగిస్తూ రూ.538 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ వాహన మిత్ర కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలో 2.76 లక్షల మందికి మంచి జరిగిస్తూ రూ.1,300 కోట్లు ఇవ్వడం జరిగింది.
ఇదొక్కటే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ సొంత టిప్పర్, సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తున్నాం.
ఇదొక్కటే కాకుండా ఆటో, టాక్సీ, స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ,సొంత టిప్పర్లు సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింప చేస్తున్నాం. ఆటో కి మాత్రమే కాదు, టాక్సీ కి మాత్రమే కాదు, మ్యాక్సీ క్యాబ్ కి మాత్రమే కాదు, సొంతంగా టిప్పర్లు లారీలు నడిపే డ్రైవర్లకు కూడా వర్తింప చేస్తున్నాం. ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా కింద పది లక్షల రూపాయల దాకా ఇచ్చేలాగా కార్యక్రమం చేస్తాం. దీనికోసం వారికి రిజిస్టర్ చేసి ఐడి కార్డులు ఇస్తాం.
స్వయం ఉపాధిని ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో టాక్సీ లారీ కొనుగోలు కోసం, బ్యాంకులు నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే, ఆ రుణాల మీద మూడు లక్షలు వరకు, వాటిపై ఆరు శాతం వడ్డీ భారం మాత్రమే ఉండేలా, అంటే అర్ధరూపాయి వడ్డీ భారం మాత్రమే వారికి ఉండేలా, మిగతా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
న్యాయవాదులకు లా నేస్తం ఇప్పుడు ఇస్తున్న విధంగానే కంటిన్యూ అవుతుంది.
దాదాపుగా 5,781 మందికి రూ.42 కోట్ల రూపాయలతో లా నేస్తం కింద, వాళ్ల సర్వీస్ లోని తొలి మూడు సంవత్సరాల్లో, వాళ్ళని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం ప్రతీనెల
రూ. 5,000 చొప్పున ఆరు నెలలకొకమారు రూ. 30,000 ఇస్తూ చేయిపట్టి నడిపించే కార్యక్రమం కొనసాగుతుంది. కొత్తగా వచ్చే అందరికీ ఈ పథకం ఇదే విధంగా కొనసాగుతుంది.
చేనేత కార్మికులకు ఈ ఐదు సంవత్సరాలలో ఏటా రూ.24 వేలు చొప్పునరూ.1,20,000 చొప్పున ఇవ్వగలిగాము.
ఈ పథకాన్ని మళ్లీ ఈ ఐదు సంవత్సరాలలో కూడా దీన్ని కొనసాగిస్తూ మరో రూ.1,20,000 చొప్పునఅందించనున్నాము. దీంతో గత ఐదేళ్లలో, రానున్న ఐదేళ్లలో కలిపి ఒక్కో లబ్దిదారునికి ఇచ్చే మొత్తాన్ని రూ.2,40,000 వరకు తీసుకెళ్తాం.
మేనిఫెస్టోలో చెప్పకపోయినా చేనేత కార్మికులకు, ఆప్కోకు గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో సహా రూ.468 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశాం.
*యువత ఉపాధికి సంబంధించి...*
రాష్ట్రంలో స్కిల్ మీద ప్రత్యేకమైన ధ్యాస, శ్రద్ధ పెట్టబోతున్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. ఆ స్కిల్ హబ్ ద్వారా ఐటిఐ, డిప్లమో, పాలిటెక్నిక్ డ్రాప్ అవుట్స్ ముగ్గురిని కలిపి ఒకే ప్లాట్పాంలోకి తీసుకువచ్చి, ఒక స్కిల్ హబ్ గా దాని తయారు చేస్తాం. దీని వల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్ షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది.. దీనికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ, రాష్ట్రంలో 175 స్కిల్ హబ్స్, జిల్లా కేంద్రాల్లో 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాం. యూనివర్సిటీ డైనమిక్ గా కోర్సులను ఇవాల్వ్ చేస్తుంది.
ఇండస్ట్రీ ని ఇందులో భాగస్వామ్యం చేస్తుంది. ఇండస్ట్రీలను కలుపుకుంటూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ను ఇందులోకి తీసుకువస్తూ, డైనమిక్ గా ఈ కోర్సులను వాళ్లందరికీ ఇంపాక్ట్ చేస్తుంది. ఈ స్కిల్ కాలేజీలను నెలకొల్పడమే కాకుండా, ఇక్కడ సీట్ తెచ్చుకుని, మనం ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తామో, వారికి పెయిడ్ ఇంటర్న్‌షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెలకు రూ.2,500 అబ్బాయిలకు, రూ.3,000 వరకు అమ్మాయిలకు ఇవ్వడం జరుగుతుంది.
*విద్యా రంగంలో*
వచ్చే ఐదేళ్లు, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన ఇవన్నీ కొనసాగుతాయి. అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చి, మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కూడా నాడు నేడు కార్యక్రమంలో భాగం చేస్తున్నాం.
2025 నుంచి ఒకటో తరగతికి ఐబీ విద్యా విధానం. ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ ను పెంచుకుంటూ 2035 నాటికి పదవ తరగతి విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న టోఫెల్ క్లాసులు మూడో తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి.
ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రత్యేక ట్యాబ్‌లు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది.
18 యూనివర్సిటీల్లో కోర్టు కేసుల్లో పెండింగ్ లో ఉన్న 3,295 అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియ కోర్టు కేసులను అధిగమించి త్వరితగతిన పూర్తి చేస్తాం.
డిజిటల్ ఎడ్యుకేషన్ లో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తే అడుగులు ముందుకు వేస్తున్నాం.
*వైద్య రంగంలో.*
వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీని రానున్న ఐదేళ్లలో హెల్త్ ను మరింత సీరియస్ గా తీసుకుంటాం. ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా విస్తరించాం. ప్రొసీజర్స్‌ను1,050 నుండి 3,300 కు పెంచాం. నెట్వర్క్ హాస్పిటల్స్ నెంబర్ కూడా బాగా పెంచడం జరిగింది.
ప్రివెంటివ్ కేర్ లో ఎవరూ చూడని అడుగులు కూడా పడ్డాయి. విలేజ్ క్లినిక్ లు గ్రామస్థాయిలో తీసుకురావడం, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా వచ్చాయి. ఆరోగ్య రంగం మీద ఇంకా ఎక్కువ ధ్యాస పెట్టాలి. ప్రొసీజర్లను ఈసారి ఇంకా పెంచాలి అని అధికారులకు చెప్పడం జరిగింది. నియామకాల విషయంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 61% ఉంటే మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 3.95%. 54 వేల పోస్టుల రిక్రూట్మెంట్ కేవలం వైద్యరంగంలో జరిగింది.
ఇప్పటికే 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పటికే నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసేలా అడుగులు ముందుకు పడుతున్నాయి. గుండెకి సంబంధించి విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 మెడికల్ హబ్ లు..
గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు..
కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు.. ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి.
*ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి...*
ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ ఐదేళ్లలో రూ. 45,412 కోట్లు ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో రూ.23,469 కోట్ల రూపాయిలు ఇవ్వగలిగాం.
ఎస్టీలకు డిబిటి ద్వారా ఈ ఐదేళ్లలో రూ.13,389 కోట్లు ఇవ్వగలిగాము. నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 5,963 కోట్లు అందించగలిగాం.
ఎస్టీలకు ఎప్పుడు జరగని విధంగా మూడు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల కింద పంచడం జరిగింది. 1,54,000 ఎస్టీ కుటుంబాలకు మంచి జరిగింది.
ఎస్సీలకు ఇప్పుడే మూడు కార్పొరేషన్లు పెట్టడం జరిగింది.
అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు కల్పించడం జరిగింది. 500 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తాండాను ప్రతి గూడెంను పంచాయితీగా వర్గీకరిస్తూ 165 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కూడా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇవ్వడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాలయాలు, అక్కడ అన్ని ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడం జరిగింది.
మొత్తం జనాభాలో కనీస 50% దళితులు ఉండి లేదా ఆ దళితుల జనాభా 500 కు పైగా ఉన్నా ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. దీన్ని కొత్తగా చేయబోతున్నాం.
క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీలకు... హిందూ దేవాలయాలకు జరుగుతున్నవి కూడా కొనసాగుతూ ఉంటాయి.
కొత్తగా తీసుకు వస్తున్న విషయం ఏమిటంటే హిందూ దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి. అన్ని ప్రార్థనాలయాలకు ఇది తీసుకొస్తున్నాం.
*బీసీ సంక్షేమం*
ఇప్పటికే డిబిటి ద్వారా రూ.1,28,000 కోట్లు నాన్ డిబిటి ద్వారా మరో రూ.53,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం.
*సామాజిక న్యాయం*
సామాజిక న్యాయం గురించి చాలా సందర్భాల్లో చెప్తున్నాను.
నాయి బ్రాహ్మణులకు ఇచ్చే దాని గురించి కూడా వెబ్సైట్లో వివరంగా పెట్టాము.
ముస్లిం మైనారిటీలకు కూడా మనం ఏం చేసామో అనేది కనిపించే విధంగా మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచాం.
కాపు సంక్షేమం కోసం కూడా ఐదేళ్లలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
ఓసీలికు ఇచ్చిన సంక్షేమ పథకాలు వివరాలను కూడా వెబ్సైట్లో వివరంగా పొందుపరిచాం.
కులవత్తిదారులు చిరు వ్యాపారులకు సంబంధించి చిన్న మార్పు చేయబోతున్నాం. జననన్న తోడు ద్వారా 16 లక్షల మందికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి, ఫుట్ పాత్ ల మీద, తోపుడు బండ్ల మీద అమ్ముకుంటున్న వారు, ఇలాంటివారు పదహారు లక్షల మందికి పదివేల వరకు సున్నా వడ్డీకే రుణాల అందించే కార్యక్రమం. దాదాపుగా రూ. 3,373 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీని ప్రభుత్వమే కడుతూ సున్నా వడ్డీకే వారికి రుణాల అందించే కార్యక్రమం చేస్తున్నాం. రుణాలను సవ్యంగా తిరిగి కట్టడాన్ని ప్రోత్సహిస్తూ, సవ్యంగా కట్టిన వారికి మరో సంవత్సరం రుణాన్ని పెంచుతూ రూ.13,000 దాకా రుణం ఇచ్చేలా తీసుకుపోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం రూ.15 వేలకు పెంచి, రూ.20,000 దాకా తీసుకెళుతున్నాం. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్.
లక్షల మందికి పెట్టుబడి సహాయం కింద రూ. 10,000 మాత్రమే ఉండేది ఇప్పుడు రూ.15,000 అయింది. సకాలంలో చెల్లించిన వారికి ప్రతి ఏడాది రూ.1,000 చొప్పున పెంచుకుంటూ రూ. 20,000 ఇప్పించే కార్యక్రమం చేస్తాం.
*జగనన్న చేదోడు* ఈ పథకం కింద షాపులు ఉన్న నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఏటా పదివేలు ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.50,000 సాయం అందించాం. ఇప్పటికే 3,38,000 మందికి రూ.1,260 కోట్లు ఇచ్చాం.
వచ్చే ఐదేళ్లలో కూడా ఈ పథకం ఇలాగే కొనసాగుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీరందరికీ ఏమేం చేసాము అనేది వివరంగా వెబ్సైట్లో ఉంచాం.
వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, ఈ ఏడాది నుండీ విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో పదిలక్షల వరకు పూర్తి వడ్డీని కోర్స్ పూర్తయ్యే వరకు, లేదా గరిష్టంగా ఐదేళ్లపాటు ప్రభుత్వమే భరిస్తుంది.
*అప్కాస్ ఉద్యోగులు, అంగన్వాడీలకు నవరత్నాలు.*
25,000 వరకు జీతం పొందే ఆప్కాస్ అంటే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నవారు... అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల పథకాలు వీళ్ళకి కూడా లభిస్తాయి.
బిపిఎల్ కుటుంబాలకు సంబంధించి గతంలో అప్పర్ సీలింగ్ అనేది రూ.6,000, రూ.5,000 గా ఉండేది.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గ్రామాల్లో రూ.10,000, రూ.12,000 కు పెంచాము.
*నేడు పథకాల లబ్ధిదారులైన కుటుంబాలు రాష్ట్రంలో దాదాపు 90 శాతం.*
ప్రతి ఇంటికి ఎవరికి ఇచ్చాం, ఎంత ఇచ్చాం, ఎవరికి ఎంత మేలు జరిగింది అనేది బటన్ నొక్కితే తెలిసే విధంగా డేటా తో సహా పారదర్శకంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా బటన్ నొక్కితే వారి కుటుంబాల ఖాతాలకు వెళ్ళేలాగా చేస్తున్నాం.
*వైయస్సార్ జీవన్ బీమా*
స్విగ్గి, జొమాటో అమెజాన్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్ కు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఐదు లక్షల జీవన బీమా కల్పించే కార్యక్రమం తీసుకువస్తున్నాం. వారిని కూడా బీమా పరిధిలోకి తీసుకొస్తాం.
*మౌలిక సదుపాయాలకు సంబంధించి...*
నాలుగు పోరŠుట్ల కడుతున్నాం, త్వరలో పూర్తి చేస్తాం.
10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడుతున్నాం. నాలుగు పోర్టుల్లో మూడు రాష్ట్ర ప్రభుత్వమే కడుతోంది. ఒకటి మాత్రం ప్రైవేట్ గా డెవలప్ అవుతోంది. దీనికి అయ్యే ఖర్చు దాదాపు రూ.20 వేల కోట్లు.
10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లాండింగ్ సెంటర్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.4,500 కోట్లు. ఇవన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు వాయువేగంగా జరుగుతున్నాయి. ఇది కూడా మరో 18 నెలల్లో పూర్తవుతుంది.
*సురక్షిత త్రాగునీరు*
వచ్చే ఐదు సంవత్సరాలలో సురక్షిత తాగునీరుపై ప్రత్యేకమైన ధ్యాస పెట్టబోతున్నాం. వాటర్ గ్రిడ్ ను కనెక్ట్ చేస్తూ, కంటామినేటెడ్ వాటర్ ను మూవ్ చేస్తున్నాం.
ఇప్పటికే పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో రూ.785 కోట్ల రూపాయలతో కంటామినేషన్ లేని సర్ఫేస్ వాటర్ ను అందించి కిడ్నీ వ్యాధులతో సమస్యలతో ఉన్న ప్రాంతానికి మేలు జరుగుతోంది.
వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 2 టన్నెల్స్ పూర్తి అయ్యాయి కనుక, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు ఊరట కలుగుతుంది.
వీటన్నిటిని ఒక గ్రిడ్ ద్వారా కనెక్ట్ చేస్తే ఈ ప్రాంతాలకు కూడా శాశ్వతంగా మేలు జరుగుతుంది. తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో కూడా
ఆక్వా ప్రాంతం అంతా, వాటర్ కంటామినేషన్ అంతా ఉన్న ప్రాంతాల సమస్యను కూడా పరిష్కరించే దిశగా ప్రత్యేకమైన ధ్యాస పెడుతున్నాం.
*రోడ్ల మరమ్మతులు పై ప్రత్యేక దృష్టి.*
రోడ్ల మరమ్మత్తులు అభివద్ధిపై కూడా ప్రత్యేక దష్టి పెడుతున్నాం. రోడ్ల మరమ్మతుల విషయమే తీసుకుంటే గత ప్రభుత్వంలో రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తే, మన ప్రభుత్వంలో రూ.43 వేల కోట్లు ఖర్చు చేశాం. కాకపోతే ఆ ప్రభుత్వంలో కరువు, మన ప్రభుత్వంలో మంచి వర్షాలు.
మంచి వర్షాల వల్ల రైతులకు మంచి జరుగుతుంది, కానీ దాని ప్రభావం రోడ్లమీద కాస్త ఎక్కువగా కనిపిస్తుంది.
కనుక రోడ్ల విషయంలో మనం అనుకున్న స్థాయిలో అభివద్ధి కనపడక పోయి ఉండకపోవచ్చు. దాని మీద కూడా ప్రత్యేక ధ్యాస పెట్టబోతున్నాం.
రోడ్లు, పార్కులు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలకు స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలను అభివద్ధి చేసే దిశగా ఇంకా అడుగులు వేస్తూ రూ.2,000 కోట్లు దానికోసం కేటాయింపు చేసి ఆ వసతులు అన్ని ఏర్పాటు చేసేలా అడుగులు పడుతున్నాయి.
ప్రతి జిల్లాలో పీపీటీ పద్ధతిలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ కచ్చితంగా ఉండేలా అభివద్ధి చేస్తున్నాం.
ఎం ఎస్ ఎం ఈ లకు ఇప్పటికే రెండుసార్లు ప్రోత్సాహకాలను అందించాం. ఇకపై ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా అడుగులు ముందుకు వేస్తాం.
*రాజధానికి సంబంధించి...*
2024లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలన రాజధానిగా పాలన సాగిస్తాం. రాష్ట్ర అభివద్ధికి గ్రోత్ ఇంజన్ లా పనిచేసేలా విశాఖన అభివద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివద్ధి చేస్తాం.
*జల యజ్ఞం*
జలయజ్ఞానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం.
ఇప్పటికే రిజర్వాయర్ల కెపాసిటీని పెంచాం. చిత్రావతి, వెలిగొండ రెండు టన్నులు పూర్తి చేయడం, అవుకు రెండు టన్నులు పూర్తి కావడం, రాయలసీమ లిఫ్ట్ కూడా త్వరలో పూర్తి చేయబోతున్నాం. పోలవరం కూడా త్వరలో పూర్తి చేస్తాం. వీటన్నిటిని ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తాం.
వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. 15 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం.
నిర్మాణంలో ఉన్న 4 ఫోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లైనింగ్ సెంటర్లను పూర్తి చేస్తాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం. ప్రభుత్వ బడులు, హాస్టల్స్, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమాలు పూర్తి చేస్తాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం.
*భూముల సమగ్ర రీ సర్వే*
17 రెవెన్యూ పంచాయతీలకు గాను దాదాపు 6వేల రెవెన్యూ పంచాయతీలలో రీ సర్వే పూర్తయింది. మిగిలినవి కూడా పూర్తి చేస్తాం.
*ఆక్వా యూనివర్సిటీ పూర్తి చేస్తాం.*
కర్నూల్ లో లా యూనివర్సిటీ పూర్తి చేస్తాం
డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కూడా పూర్తి చేస్తాం.
గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్, గిరిజన యూనివర్సిటీ రెండు కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది కూడా త్వరగా పూర్తి చేస్తాం.
ఇప్పటికే మొదలుపెట్టిన ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్ లు, కోల్డ్ స్టోరేజ్ లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు అవి కూడా పూర్తి అవుతాయి.
ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్ ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో వారి చేత సర్టిఫికెట్లు అందజేస్తూ, డిగ్రీలో కోర్సులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియం తో పాటు ఏటా ఒక తరగతికి ఐబీ సిలబస్ ను అమలు చేసుకుంటూ పోతాం. ఇవన్నీ కూడా వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తాం.