షుక్రియా.. సీఎం సార్
15 Sep, 2022 09:34 IST
అమరావతి: పేదింటి యువతుల వివాహాలను గౌరవంగా జరిపించేందుకు సీఎం వైయస్ జగన్ ప్రవేశపెడుతున్న వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కడపలో మహిళలు ‘కృతజ్ఞతా ర్యాలీ’ నిర్వహించారు. ‘షుక్రియా సీఎం సార్.. థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ నినాదాలు చేస్తూ.. సీఎం వైయస్ జగన్‌పై తమ అభిమానాన్ని చాటుతూ ర్యాలీ నిర్వహించారు.
వైయస్ఆర్ ఆడిటోరియం వద్ద ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా దీనిని ప్రారంభించారు. అలాగే విశాఖలోని లక్ష్మీటాకీసు వద్ద సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. పేదల పెన్నిధి సీఎం క్షేమం కోరుతూ శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్ సింహాచలం కొబ్బరికాయలు కొట్టారు.