'ట్రెండ్ సెట్టర్'@ వైయస్ జగన్
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు, చారిత్రాత్మక చట్టాలు చేస్తూ దేశానికే దిక్సూచిగా మారారు. వైయస్ జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయి, పదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఉద్దేశించి వైయస్‌ఆర్‌సీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పలు అంశాలను వివరించింది. ఏపీలో వైయస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారు. దేశ రాజకీయాల్లో ఆయనో ట్రెండ్ సెట్టర్ అయ్యారు.
సీఎం వైయస్ జగన్ ఏపీలోని ప్రభుత్వ బడుల్లో తీసుకొచ్చిన 'ఇంగ్లిష్ మీడియం'ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు. అధికార వికేంద్రీకరణను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అనుసరించాలనుకుంటున్నారు. దిశ చట్టం గురించి తెలపమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరారు. దిశ చట్టాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకున్నారు. వికేంద్రీకరణ కోసం 3 రాజధానుల ఏర్పాటు కోసం ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ , జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఆలోచిస్తున్నారు.