మది మదిలో విజయోత్సవం..

9 Jan, 2019 15:40 IST

 

జననేత అడుగులు వేయి ఏనుగుల బలం.. ఆ చిక్కటి చిరునవ్వుల పలకరింపు కొండంత ధైర్యం..ఆ చల్లని ఆపన్నహస్తం ఎన్నో హృదయాలకు ఊరట. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరుకు అడుగడుగున ప్రజా సంకల్పమే..ఆ పాదయాత్రికుడి నడకదారిలో  ఎన్నో  కన్నీటి కథలు..కష్టాల వ్యధలు, మరెన్నో మరుపురాని దృశ్యాలు.. సుడులు తిరిగే కన్నీళ్లకు ఓదార్పై..ప్రజల కష్టాలు చూసి చలించే మనస్సై , ప్రత్యర్థుల ఎదురుదాడులను ధైర్యంగా ఎదుర్కొనే ధీటైన ధీరత్వమై..బాధలను మౌనంగా గుండెల్లో దాచుకున్న నిండైన వ్యక్తిత్వమై..వేల కిలోమీటర్లు ముందుకు సాగారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరుకు అందరికి ఆయనంటే జగనంతా అభిమానం. ఆ జననేతను  ప్రజలందరూ అక్కున చేర్చుకున్నారు.

చిన్నారులకు మావయ్యగా...యువతకు స్నేహితుడిగా.. అక్కాచెల్లెమ్మలకు పెద్దన్నయ్యగా..తల్లులకు పెద్ద కొడుకుగా,వృద్ధులకు మనవడిలా భావించారు.మా కష్టాలు తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి మా రాజన్న బిడ్డ వచ్చాడంటూ ఆనందంతో కళ్లు చెమర్చారు.సంతోషంతో ఉబ్బితబ్బియ్యారు.ప్రభుత్వం అవినీతి,అక్రమాలపై ప్రజల తరపున గళం విప్పి ప్రశ్నించిన జననేతను మనస్సారా దీవించారు.మా ఆశా దీపం నీవేనంటూ గుండె నిండా నమ్మకం పెంచుకున్నారు.పల్లెలు,పట్టణాలు,నగరాలు జననేతను గుండెల్లో పెట్టుకున్నాయి.

పాదయాత్ర ఆఖరి ఘట్టం..దేశ చరిత్రలో లిఖించే సువర్ణ అధ్యాయం.ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరుకు 341 రోజులు..2,516 గ్రామాలు... 231 మండలాలు.. 137 నియోజవర్గాలు...8 కార్పొరేషన్లు.. 54 మున్సిపాల్టీలు..3,648 కిలోమీటర్లు... 55 ఆత్మీయ సమ్మేళనాలు.. 127 బహిరంగ సభలు.  చరిత్ర చెప్పి సాక్ష్యం..జనాంతరంగం వెల్లువై ఉప్పొంగింది..ప్రభంజనమై ముందుకు కదిలింది..జననేత నాయకత్వంలో ఉందిలే మంచికాలం ముందుముందునా..