మళ్లీ వైయస్ జగన్ దే జయం
అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి కూడా ప్రజలు సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డినే కోరుకుంటున్నారని ఇండియా టుడే - మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్ఆర్ సీపీదే విజయం అని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. ఇండియా టుడే - మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే లో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్ఆర్ సీపీకి 18 పార్లమెంటు స్థానాలు, టీడీపీకి ఏడు స్థానాలు దక్కుతాయని సర్వే తేల్చి చెప్పింది. ఆగస్టు ఎడిషన్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ నిర్వహించామని ఇండియా టుడే స్పష్టం చేసింది. గత నెలలో ఇండియా టీవీ కూడా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్ఆర్ సీపీకి 19 స్థానాలు, టీడీపీకి ఆరు స్థానాలు లభిస్తాయని చెప్పాయి. 126 స్థానాల వరకూ... పార్లమెంటు స్థానాలలో ఉన్న నియోజకవర్గాలను బట్టి చూస్తే ఇండియా టీవీ సర్వేలో 133 అసెంబ్లీ స్థానాలు, ఇండియా టుడే సర్వే ప్రకారం 126 అసెంబ్లీ స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్ఆర్ సీపీకి వస్తాయిన తేల్చింది. దీంతో వైయస్ఆర్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఈ సర్వేలో తేలింది. రెండు సంస్థలు విడివిడిగా రెండు నెలల్లో చేసిన సర్వేల్లో వైయస్ఆర్ సీపీయే అగ్రస్థానంలో ఉండటం విశేషం.
అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. దేశంలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా 5 వ స్థానం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని సర్వేలో వెల్లడైంది. వైయస్ఆర్‌సీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో స్పష్టమయింది. 57 శాతం ప్రజలు వైయస్ జగన్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారనిమూడ్ అఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే సర్వే , ఆగష్టు 11 , 2022న వెల్లడించింది.
సర్వేలే కాదు..క్షేత్రస్థాయిలో ఏ ఒక్కరిని అడిగినా సీఎం వైయస్ జగన్ పాలనలో సంతోషంగా, సంతృప్తికరంగా ఉన్నామని చెబుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదిస్తామని గడప గడపలో ప్రజలు నినదిస్తున్నారు.