వైఎస్ జగన్ కామెంట్స్

27 Nov, 2015 18:43 IST
ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో వైఎస్ జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, బాధితులకు ఓదార్పునిస్తున్నారు. అధైర్య పడొద్దని భరోసానిస్తున్నారు. గత 15 రోజులుగా కుండపోత వర్షాలు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ , గోదావరి జిల్లాలను అతలాకుతలం చేశాయి. ప్రజలు తిండితిప్పలు లేక అలమటిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు మొద్దునిద్ర పోతున్నారు. ఎక్కడ కూడా బాధితులను ఆదుకోవడం లేదు. బాధితుల కష్టాలు అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్ మాటల్లో...

  • గోదావరి జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నీటిలో మునిగిపోతే ముఖ్యమంత్రి, అధికారులు కన్నెత్రి కూడా చూడడం లేదు

  • సీఎం అనే వ్యక్తి కనీసం బాధిత రైతులకు వద్దకు వెళ్లడం లేదు, రైతులకు భరోసానిచ్చే కార్యక్రమం చేయడం లేదు

  • మొలకలెత్తిన ధాన్యానికి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, అధికారులు వచ్చి పంట నష్టం రాసుకుంటున్నారా అంటే అదీ లేదు

  • కనీసం తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నారా అంటే చంద్రబాబు అదీ చేయడం లేదు

  • నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టకరం

  • నీలం, లైలా, జల్ తుఫాన్ లకు సంబంధించి ప్రకటించిన నష్టపరిహారం ఇప్పవరకు రైతులకు పైసా చెల్లించలేదు

  • ఇప్పుడు కూడా ఇస్తారో లేదోనన్న ఆందోళనతో రైతులు ఉన్నారు

  • ఎకరాకు 25 నుంచి 30 వేలు అప్పులు చేసి మరీ రైతులు పంటలు వేసి నష్టపోయారు

  • దెబ్బతిన్న పంటలను చూస్తేనైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కలుగుతుందని ఆశిస్తున్నాం