ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ టాప్ టెన్ కామెంట్లు..!

14 Mar, 2016 20:35 IST


హైదరాబాద్) శాసనసభలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఒక్కొక్కటిగా తూర్పార పట్టారు. ఆయన ప్రసంగంలోని టాప్ టెన్ కామెంట్లు ఇప్పుడు చూద్దాం.

 

1.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండు ఎకరాలు. ఇప్పుడు మాత్రం రెండు లక్షల కోట్లు. అంత సొమ్ము ఎలా పోగేసుకొన్నారు.

2.  ఓటుకి కోట్లు కేసులో 20 కోట్ల రూపాయిలు చెల్లిస్తూ ఆడియో, వీడియో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు నీతులు చెబుతారా.

3.  సభలో ఏం మాట్లాడాలో...ఏం మాట్లాడ కూడదో చంద్రబాబే చెబుతారా

4.  సభలో అవినీతి ఆరోపణలు చేయకూడదు, సీబీ ఐ విచారణ అడగకూడదు అని ఏమైనా ఆర్డర్ పాస్ చేశారా

5.  సభలో ఏం మాట్లాడినా వక్రీకరించటమే పనిగా మంత్రుల చేత ఆరోపణలు చేయిస్తున్నారు.

6.  అన్ని పనులు జన్మభూమి కమిటీలకే అప్పగిస్తున్నారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేదా

7.  రూ. 10 లక్షల దాకా పనుల్ని నామినేషన్ పద్దతిలో జన్మభూమి కమిటీలు అప్పగించవచ్చు అని రూల్ పాస్ చేశారు. అంటే సర్పంచ్ లు, పంచాయతీ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకం అయినట్లు కాదా

8.  జరగుతున్నదంతా అయిదు కోట్ల మంది చూస్తూనే ఉన్నారు

9.  మాట్లాడుతున్న మాటల్ని వక్రీకరిస్తున్నారు

10.              20 ఆరోపణలు చేశాం. సీబీ  ఐ చేత దర్యాప్తు చేయించాలి.