వైఎస్ జగన్ టాప్ టెన్ కామెంట్లు..!
హైదరాబాద్) అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాజధాని భూముల దందా సహా అనేక అంశాలపై చంద్రబాబు చేస్తున్న అక్రమాలపై నిశితంగా తూర్పారబట్టారు. అడ్డగోలుగా మంత్రులు, సీనియర్ సభ్యులు అడ్డు తగులుతున్నప్పటికీ, చంద్రబాబు అవినీతి చిట్టాను విడమరిచి చెప్పారు. వైఎస్ జగన్ ప్రసంగంలోని టాప్ టెన్ పవర్ ఫుల్ కామెంట్లు.
1. చంద్రబాబు రాష్ట్రంలో బీద ఏడుపులు ఏడుస్తారు.. ఢిల్లీలో మాత్రం నాయకుల్ని బ్రహ్మాండంగా పొగడుతారు.
2. కేంద్రం వనరులు, నిధులు ఇస్తాం రాజధాని పనులు చేయండంటే చేయరు.. సింగపూర్, చైనాతో చేయిస్తామంటారు. ఏ దేశం వెళితే ఆ దేశంలో చేయిస్తామంటారు.
3. రాజధాని ప్రాంతంలో ఒక్క ఇటుక పడలేదు. రెండేళ్లు అవుతోంది గ్రాఫిక్ ఫోటోలు మాత్రం చూపిస్తున్నారు.
4. మా ప్రసంగాన్ని చెప్పనివ్వరు. మంత్రుల చేత మాత్రం అడ్డగోలుగా తిట్టిస్తారు. ఇదేమి తీరు.. దేవుడు అంతా చూస్తూనే ఉన్నాడు.
5. కోర్టులో కేసులు అనగానే మేం ఎప్పుడూ భయపడలేదు. భయపడి ముందే వెళ్లి కాళ్లు పట్టుకొని స్టే ఆర్డర్ తెచ్చుకొన్నది ఎవరు..!
6. సీబీఐ ఎంక్వయిరీ అంటే ఉలికి పడుతున్నది ఎవరో అందరికీ తెలుసు
7. భారత దేశంలో ఉన్న సగటు గ్రోత్ రేటు కన్నా ఏపీలో ఎక్కువ గ్రోత్ రేటు చూపిస్తున్నారు. అంకెల గారడీ కి హద్దు ఉండాలి కదా
8. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీ అని కూడా అంటున్నారు.
9. చంద్రబాబు వచ్చాక కొత్త పరిశ్రమలు రాలేదు సరికదా ఉన్నవి మూతపడుతున్నాయి. ఐటీ, జిన్నింగ్, కాటన్..అన్ని పరిశ్రమలు మూతపడుతూనే వచ్చాయి.
10. అసలు నిందితుడు చంద్రబాబే..ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసింది చంద్రబాబే. తప్పులు చేసిన వ్యక్తే తిరిగి తప్పులు చూపించండి అని అడగటం ఏమిటి.