చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్

16 Nov, 2015 20:44 IST

కుటిల యత్నాలకు, కుట్రలకు పెట్టింది పేరు చంద్రబాబు. అందుకే ఆయన పాలన సమస్తం అటువంటి అడుగులతోటే నడుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లోచంద్రబాబు ఇప్పుడు అదే మైండ్ గేమ్ కొనసాగిస్తున్నారు. పోలీసు డిపార్టు మెంట్ లో లా అండ్ ఆర్డర్ పోస్టింగులకు చాలా డిమాండ్ ఉంటుంది. అంటే శాంతిభద్రతల బాధ్యతలు చూసే పోస్టింగ్ లు అన్నమాట. ముఖ్యంగా ఐపీఎస్ ల విషయంలో అయితే జిల్లా ఎస్పీలు, స్టేట్ క్యాడర్ లో అయితే డీ ఎస్పీల పోస్టులకు క్రేజ్ ఎక్కువ. వీటిని కేటాయించే అధికారం డీజీపీ దగ్గర ఉంటుంది.

ఈ దండాన్ని ఉపయోగించి చంద్రబాబు చీకటి ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల మీద దాడులకు పోలీసుల్ని ఉసిగొల్పుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల్ని ఎంత ఎక్కువగా వేధిస్తే అంత సేఫ్ అన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. దీనికి అంగీకరించకుండా రూల్స్ కు అనుగుణంగా వెళ్లాలని భావిస్తే లూప్ లైన్ కు పంపిస్తామని బెదిరిస్తున్నారు. చంద్రబాబు ఆడుతున్న ఈ మైండ్ గేమ్ ను గుర్తించిన పోలీసు అధికారులు చాలా చోట్ల చెలరేగుతున్నారు. లా అండ్ ఆర్డర్ పోస్టింగుల్ని కాపాడుకొనేందుకు పచ్చ చొక్కా నాయకులు ఆడమన్నట్లుగా ఆడుతున్నారు.

ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు..పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న రాజధానిప్రాంతంలో చెరకు రైతు పొలాన్ని తెలుగుదేశం గూండాలు తగలబెడితే, ఆయన మేనల్లుడ్నే చిత్రహింసలు పెట్టి కేసును అతడి మీద రుద్దేసే ప్రయత్నం చేశారు . నిన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని టీడీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే వాళ్లను ఏమీ అనకుండా, అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ని అరెస్టు చేశారు. ఈ రోజు ప్రజాస్వామ్య యుతంగా ఆందోళన చేస్తున్న బందరు నేత పేర్ని నానిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

దీన్ని బట్టి చూస్తుంటే ఇంకా ఎక్కువగా పోలీసు అధికారుల్ని ఉసిగొలిపి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మీద దాడులు చేయించేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్న సంగతి అర్థం అవుతోంది. పోస్టింగ్ ల పేరుతో చంద్రబాబు ఆడుతున్న చీకటి కుట్రలు తెలిసి వస్తున్నాయి.