ప్రత్యేకహోదా - 10 వాస్త‌వాలు

17 Sep, 2015 16:18 IST
హైద‌రాబాద్‌: రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక స‌మస్య‌ల‌కు ప్ర‌త్యేక హోదా యే ప‌రిష్కారం. దీనికి సంబంధించిన 10 అంశాలు.

  • రాష్ట్ర విభ‌జ‌న తో ఆర్థికంగా రాష్ట్రం కుదేలు అయిపోయింది. ప‌రిశ్ర‌మ‌లు అన్నీ హైద‌రాబాద్ కే ప‌రిమితం అవ‌టంతో వీటితో వ‌చ్చే ఆదాయం, ఉద్యోగాలు అక్క‌డే నిలిచిపోయాయి.
  • విభ‌జ‌న స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని పార్ల‌మెంటు సాక్షిగా ప్ర‌త్యేక హో దా ఇస్తామ‌ని ప్ర‌కటించారు. నేటి అధికారబీజేపీ, (అప్ప‌టి ప్ర‌తిప‌క్షం ) దీన్ని స‌మ‌ర్థించింది. 
  • రాష్ట్రానికి ప్రాణవాయువులాంటి ప్రత్యేకహోదా. ఉద్యోగాలైనా, పరిశ్రమలైనా, పన్నురాయితీలైనా ఇలా ఏదైనా ప్రత్యేకహోదాతోనే సాధ్యమవుతాయి.
  • మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకహోదా రాష్ట్రాలకు కేంద్ర గ్రాంట్లు 90 శాంతం వస్తాయి. 10 శాతం మాత్రమే లోన్ వస్తుంది. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు. లోన్ ద్వారా ఐతే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 
  • ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇస్తారు.100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఇన్ కమ్ ట్యాక్స్ లో కూడా 100 శాతం రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపులు, ప్రైట్ రీయింబర్స్ మెంట్ లు దక్కితే... పారిశ్రామికవేత్తలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతారు. 
  • ప్ర‌త్యేక హోదాతో పెద్ద సంఖ్య‌లో ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయి.  లక్షల సంఖ్యలో ఉద్యోగఅవకాశాలు సమకూరుతాయి. 
  • పదేళ్ల ప్రత్యేకహోదాతో ఏపీలోని 13 జిల్లాలు ఒక్కో హైదరాబాద్ గా మారతాయి. అప్పుడు ప్రతికంపెనీ నిరుద్యోగుల కోసం వాంటెడ్ బోర్డులు పెట్టేస్తాయి. 
  • పన్నురాయితీలు, ప్రోత్సహకాల వల్ల మనం కొనుగోలు చేస్తున్న అనేక వస్తువుల ధరలు సగానికి తగ్గుతాయి. 
  • 5 కోట్ల ప్రజానీకం గల 972 కి.మీ. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లభిస్తే అది పెద్ద సంజీవనే అవుతుంది.