ఎమ్మెల్యే రోజా బహు భాషలతో ప్రజలకు పలకరింపు

23 Nov, 2015 16:52 IST

చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి రోజా వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వ అధికారుల్ని ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్లి అక్కడ జరుగుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా వరదల్లో చిక్కుకొన్న బాధితులకు కావలసిన నిత్యావసర వస్తువుల్ని ఇప్పించేందుకు ప్రయత్నించారు. అయితే సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ బాధల్ని తమిళంలో చెబుతుంటే తెలుసుకొనేందుకు అధికారులు ఇబ్బంది పడ్డారు. దీంతో తమిళం, తెలుగు రెండు భాషలు తెలిసిన రోజా అక్కడ అనువాదం చేశారు. తమిళంలో బాధితులు అడుగుతున్న ప్రశ్నల్ని అధికారులకు తెలుగులో వివరించి సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. 

వరద సహాయ చర్యల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సూచన మేరకు ఎక్కడికక్కడ నాయకులు తమ తమ ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రోజా సహాయ చర్యలు ముమ్మరంగా చేయిస్తున్నారు. 

ఈ రెండు నిముషాల వీడియోలో మొత్తం పర్యటన, సంభాషణలు చూడవచ్చు.