రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు చేపట్టారు. శనివారం విజయవాడ, విశాఖ, విజయనగరం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో వైయస్ఆర్ సీపీ శ్రేణులు నల్లచొక్కాలు, నల్ల రిబ్బన్లు ధరించి, నల్లజెండాలతో గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత ప్రదర్శనలు చేపట్టారు. చంద్రబాబు హత్యారాజకీయాలను పార్టీ నేతలు దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి యుత వాతావరణం నెలకొల్పేలా మంచి బుద్ధి ప్రసాదించాలని గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి కంటతడి పెట్టారు. వైయస్ వివేకానందరెడ్డి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు.