పార్టీ తరపున వైఎస్ విజయమ్మ పోరాటాలు

19 Apr, 2016 15:29 IST

వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ తరుపున ప్రజల సమస్యల మీద అనేక పోరాటాలు చేశారు. ధర్నాలు, ఆందోళనల్లో పాలు పంచుకొన్నారు.

1. మ‌హాధ‌ర్నా (16-07-2012):  రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రిని నిర‌సిస్తూ పులివెందుల‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ధ‌ర్నాలో వైఎస్ విజ‌య‌మ్మ పాల్గొని, ప్ర‌సంగించారు.

2. మ‌హాధ‌ర్నా (17-07-2012):  విద్యుత్ కోత‌ల‌కు నిర‌స‌న‌గా విజ‌య‌వాడ ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాల‌యం వ‌ద్ద ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ ధ‌ర్నా నిర్వ‌హించారు.

3. చేనేత దీక్ష (23-07-2012):  చేనేత కార్మికుల‌కు సంఘీభావంగా క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్ల‌లో ఒక రోజు చేనేత దీక్ష‌

4. ఫీజు దీక్ష (13-08-2012 నుంచి 14-08-2012):  ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్‌పై ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తూ, పేద విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో రెండు రోజుల దీక్ష‌

5. ఫీజు పోరు దీక్ష (06-09-2012 నుంచి 07-09-2012 వ‌ర‌కు):  వైఎస్సార్ ప్ర‌వేశ‌పెట్టిన ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కానికి రాష్ట్ర ప్ర‌భుత్వం తూట్లు పొడుస్తున్నందుకు నిర‌స‌న‌గా ఇందిరాపార్కు వ‌ద్ద రెండు రోజుల దీక్ష‌

6. విద్యుత్ చార్జీల‌పై మ‌హా ధ‌ర్నా (09-07-2013):  విద్యుత్ చార్జీల పెంపున‌కు నిర‌స‌న‌గా రాష్ట్రవ్యాప్త ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా క‌ర్నూలు ఎస్ఈ కార్యాల‌యం వ‌ద్ద నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నాల్లో వైఎస్ విజ‌య‌మ్మ పాల్గొన్నారు.

7. విద్యుత్ కోత‌లు, కరెంటు చార్జీల‌పై మ‌హాధ‌ర్నా (04-03-2013): అసాధార‌ణ‌మైన విద్యుత్ కోత‌లు, క‌రెంటు చార్జీల పెంపున‌కు నిర‌స‌న‌గా గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో జ‌రిగిన మ‌హాధ‌ర్నాలో పాల్గొన్న ష‌ర్మిల‌తో క‌లిసి పాల్గొన్న విజ‌య‌మ్మ‌

8. క‌రెంటు స‌త్యాగ్ర‌హం (02-04-2013 నుంచి 06-04-2013 అర్ద‌రాత్రి వ‌ర‌కు):  పెంచిన క‌రెంటు చార్జీల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరుతూ న్యూ ఎమ్మెల్యే క్వార్డ‌ర్స్‌లో ఐదు రోజుల పాటు   దీక్ష చేసిన విజ‌య‌మ్మ‌

9. జ‌గ‌న్ అరెస్ట్ చేసిన ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా (28-05-2013):  ఇందిరాపార్క్ వ‌ద్ద పార్టీ శ్రేణుల‌తో క‌లిసి ఒక రోజు నిర‌శన దీక్ష చేశారు. దీక్ష‌లో జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తి కూడా పాల్గొన్నారు.

10. ఫీజు దీక్ష (18-07-2013 నుంచి 19-07-2013 వ‌ర‌కు):  ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కం కోసం ఇందిరాపార్కు వ‌ద్ద రెండు రోజుల దీక్ష‌

11. రాష్ట్ర విభ‌జ‌న‌పై కాంగ్రెస్ పార్టీ ఏక‌ప‌క్ష వైఖ‌రికి నిర‌స‌న‌గా గుంటూరులో 19-08-2013 నుంచి 24-08-2013 ఉద‌యం 11 వ‌ర‌కు నిరవధిక దీక్ష చేప‌ట్టిన వైఎస్ విజ‌య‌మ్మ‌

12.  రాష్ట్రాన్ని స‌మైక్యంగా కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తూ స‌చివాల‌య సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నాలో పాల్గొని సంఘీభావం ప్ర‌క‌టించిన వైఎస్ విజ‌య‌మ్మ‌