అప్పుల ఘనత చంద్రబాబుదే..!

1 Apr, 2016 19:03 IST

 () అప్పుల్ని డబుల్ చేసిన చంద్రబాబు

() వ్యవస్థల్ని లోటు మార్గంలోకి నడుపుతున్న బాబు

() సోకులు, విలాసాలతో ప్రజల నెత్తిన అప్పుల కుప్ప

హైదరాబాద్) ప్రతీసారి 30 ఏళ్ల అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల వలయంగా మార్చేస్తున్నారు. విలాసాలు, సోకులకు తోడు అవినీతి పథకాలకు విరివిగా డబ్బులు ధార పోస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోంది. తాజాగా వెల్లడవుతున్న గణాంకాలే ఇందుకు నిదర్శనం.

రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల పరిస్థితుల్ని లెక్క కట్టింది. అందులో ఏపీకి అప్పుల్ని రూ. 97, 123 కోట్లను పంచింది. 30 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు గద్దెనెక్కాక ఈ అప్పుల భారాన్ని తగ్గిస్తారని ఎవరైనా ఆశిస్తారు. కానీ ఈయన గారి నిర్వాకంతో అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. స్వయంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పుస్తకాల్లో రూ. 1, 90, 513 కోట్ల మేర అప్పుల్ని లెక్క తేల్చారు. అంటే దాదాపు అప్పుల విలువ రెట్టింపు అయిందన్న మాట. రెండేళ్లలో 93 వేల కోట్ల రూపాయిల మేర అప్పులు చేసి తప్పించుకొంటున్నారు.

గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వ పరిపాలన లో ఆర్థిక వ్యవస్థ కుదేలై పోయింది. పూర్తిగా చతికిల పడిపోయిన తరుణంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేపట్టారు. రెండేళ్లలోనే పరిస్థితిని చక్కదిద్దారు. లోటు బడ్జెట్ ను గాడిలోకి పెట్టి మిగులు లోకి తీసుకొని వచ్చారు. దీంతో 2006..07 నాటికి మిగులు వ్యవస్థ మొదలైంది. అప్పుడు ఏర్పరచిన విధానాలతో వరుసగా ఎనిమిదేళ్ల పాటు అదే వ్యవస్థ కొనసాగింది. మళ్లీ చంద్రబాబు తిరిగి వచ్చాక పరిస్థితి మొదటికి వచ్చింద. రెండేళ్లకే రూ. 24 వేల కోట్ల మేర లోటు న చూపించారు. అంటే వ్యవస్థలు ఏ స్థాయిలో పతనం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

పట్టిసీమ వంటి అవినీత పథకాలు, రాజధాని ప్రాంతాన్ని అడ్డగోలుగా సింగపూర్ కంపెనీలకు అమ్మకం పెట్టడం వంటివి ఒక వైపు, విదేశీ ప్రయాణాలు, ప్రత్యేక విమానాల ఖర్చులు అన్నీ తడిసి మోపెడు అవుతున్నాయి. అన్నీ చోట్ల తెలుగు తమ్ముళ్లు చేతివాటం చూపిస్తుండటంతో ప్రభుత్వ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల నెత్తిన అప్పుల భారం అంతకంతకూ అధికం అవుతోంది.