వైయస్ జగన్ విజయం ఒక సునామీ
23 May, 2019 18:44 IST
అమరావతి: మెజారిటీలు తాము ఊహించినవేనని, భారీ విజయానికి వైయస్ జగన్‌పై ప్రజలకున్న విశ్వాసమే దారి తీసిందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏపీలో వైయస్ఆర్‌సీపీ సాధించిన తిరుగులేని విజయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైయస్ జగన్ గెలుపును ఒక సునామీగా అభివర్ణించారు. ఏపీలో అభివృద్ధి వైయస్ జగన్ నాయకత్వంలోనే జరుగుతుందని ప్రజలు విశ్వసించారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని బొత్స దుయ్యబట్టారు. అవినీతి కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ పాలనకు భిన్నంగా తమ పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఐదేళ్లు అధికారాన్నిస్తే చంద్రబాబు దుర్వినియోగం చేశారని విమర్శించారు. చంద్రబాబు పథకాలపై ప్రజలకు నమ్మకం లేదని బొత్స పేర్కొన్నారు.