టీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
19 Apr, 2024 18:21 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్స్,ట్విట్టర్,రీల్స్ వంటి వాటిలో అనుచిత వ్యాఖ్యలు, ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్నారని ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం అని పేర్కొంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజి మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఇందుకు తగిన ఆధారాలను ఎన్నికల కమీషన్ ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా కి అందించారు. ఇందుకు బాధ్యులైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు.