ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
25 Apr, 2025 15:35 IST
బెంగళూరు : ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) మృతి పట్ల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. భారత దేశ అంతరిక్ష చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారు. కస్తూరి రంగన్‌కు నివాళులర్పిస్తూ..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా` అంటూ వైయస్ జగన్ ఎక్స్‌లో పోస్టు చేశారు.