2014లో ఇంటింటా సంతోషాలు నిండాలి

1 Jan, 2014 13:17 IST
హైదరాబాద్, 01 జనవరి 2014:

ఈ నూతన సంవత్సరం రాష్ట్రంలోని ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. 2014 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రంలోని 9 కోట్ల ప్రజల భద్రతకు, అభివృద్ధికి, సంక్షేమానికి భరోసా లభించాలని ఆయన అభిలషించారు. క్యాలెండర్ల మార్పుతో పాటు 2014 మన రాష్ట్రంలోని, మన దేశంలోని ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పునకు దారితీయాలని తన శుభాకాంక్షల సందేశంలో మనస్ఫూర్తిగా శ్రీ జగన్‌ కోరుకున్నారు.