
హైదరాబాద్, 10 అక్టోబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సంయుక్త సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభం అవుతుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ నిరాకరించిన దరిమిలా పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొంటారు.