వైయస్ జగన్‌కు మహేష్‌బాబు శుభాకాంక్షలు
24 May, 2019 15:32 IST
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ‘ఏపీలో ఘనవిజయం సాధించిన వైయస్ జగన్ గారికి శుభాకాంక్షలు. మీ పాలనలో రాష్ట్రం సరికొత్త ఎత్తుకు చేరుకోవాలనీ, మీ పదవీకాలం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.