ప్రజాప్రస్థానం సమన్వయ, కార్యాచరణ కమిటీ ఇదే
15 Oct, 2012 01:06 IST
హైదరాబాద్, 13 అక్టోబర్ 2012: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్న 'మరో ప్రజాప్రస్థానం' రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సమన్వయ, కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సభ్యులుగా ఎంపికైన వారి పేర్లను పార్టీ శనివారంనాడు ప్రకటించింది. వైయస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభయ్యే మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.
పాదయాత్ర సవన్వయ, కార్యాచరణ కమిటీలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తలశిల రఘురాం, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ప్రసాదరాజు, డి. శివశంకరరెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, కె.కె. మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారని పార్టీ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.