'నల్లకాల్వలో ఆదివారం రక్తదాన శిబిరం'
1 Sep, 2012 00:33 IST
స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 2 ఆదివారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. హెలికాప్టర్ దుర్ఘటనలో రాజశేఖరరెడ్డి మరణించిన కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద ఆదివారంనాడు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం, అన్నదానం, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు శుక్రవారంనాడు ఒక ప్రకటనలో పుత్తా తెలిపారు.