నవ్యాంధ్రలో నవశకం ఆరంభమైంది

31 May, 2019 12:57 IST

అమ‌రావ‌తి:  న‌వ్యాంధ్ర‌లో న‌వ‌శ‌కం ఆరంభ‌మైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  రాజసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో నవ్యాంధ్రలో నవశకం మొదయ్యిందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి రహిత పాలనను పారదర్శకంగా వైయ‌స్ జగన్‌ అందించనున్నారని తెలిపారు. ప్రజల కష్టాలను తొలగించడమే ఆయన ఆకాంక్ష అని, ఇందుకోసం ఆయన నిరంతరం శ్రమిస్తారని ట్వీట్‌ చేశారు.