మాదిగల ఆత్మగౌరవం టిడిపికి తాకట్టా!
24 Oct, 2012 13:27 IST
హైదరాబాద్, 24 అక్టోబర్ 2012 : మాదిగల అభ్యున్నతికోసమంటూ ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబుకు ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వటం మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టటమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు మండిపడ్డారు. పూటకో మాట, రోజుకు ఒకరికి మద్దతిస్తూ మంద కృష్ణ విచిత్రంగా వ్యవహరించే బదులు టీడీపీలో చేరిపోవాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. గత ఎన్నికల్లో మాదిగల కోసమంటూ ప్రత్యేక పార్టీ పెట్టిన మంద కృష్ణ. తాను స్వయంగా మధిర స్థానం నుంచి పోటీ చేశారని, అయితే ఆ నియోజకవర్గంలో 60 వేల మాదిగల ఓట్లు ఉంటే ఆయనకు 20 వేల ఓట్లు కూడా దాటలేదని ఎద్దేవా చేశారు.